కీర్తి సురేష్ ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు.ఆమె తల్లి కూడా ఇండస్ట్రీలో హీరోయిన్ కావడంతో కీర్తి బాలనటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అనతి కాలంలోనే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది. ప్రజంట్ కోలీవుడ్, బాలీవుడ్ లో కూడా నటిస్తోంది. అయినప్పటికి మంచి హిట్ కోటి కీర్తి చాలా కాలం అయింది. ఈ మధ్య గ్లామర్ డోస్ పెంచి.. అందాల తెర తీసిన కానీ తన చిత్రాలు విజయం అందుకోవడం లేదు. ఇక రీసెంట్ గా వివాహ బంధం లో అడుగుపెట్టిన ఈ చిన్నది హ్యాపి లైఫ్ లీడ్ చేస్తుంది. అయితే కీర్తి కి సంబంధించి ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఏంటి అంటే..?
Also Read:Anasuya : మొత్తం విప్పుకొని తిరుగుతా మీకెందుకు.. స్టార్ యాంకర్ బోల్డ్ కామెంట్స్
చిన్నతనంలో హీరో దిలీప్ నటించిన ఓ సినిమాలో ఆయన కూతురు పాత్రలో నటించిందట కీర్తి సురేష్. ఇక అప్పటి నుండి దిలీప్ ను అంకుల్ అని పిలవడం అలవాటైపోయింది. ఆ తర్వాత కొద్ది రోజులకే దిలీప్ నటించిన ‘రింగు మాస్టర్’ సినిమాలో ఆయనకి గర్ల్‌ఫ్రెండ్ పాత్రలో కీర్తి సురేష్ నటించింది. అయితే ఆ సినిమా షూటింగ్ సమయంలో కీర్తి సురేష్ ఎక్కడ తనని అంకుల్ అని పిలుస్తుందో అని భయపడ్డా దిలీప్ వెంటనే కీర్తి దగ్గరికి వచ్చి ప్లీజ్ నన్ను అంకుల్ అని అయితే పిలువకు.. కావాలంటే చేటా అంటే అన్నయ్య అని పిలువు.. అని గట్టిగా చెప్పాడట. దీంతో అప్పటి నుండి చేటా అని పిలవడం మొదలు పెట్టింది. అంతే కాదు ‘ఎవరికైతే కూతురు పాత్రలో నటించిందో మళ్లీ ఆ హీరోకే ప్రియురాలు పాత్రలో నటించడం జరిగింది’ అంటూ కీర్తి సురేష్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. బాలీవుడ్ లో తన అప్ కమింగ్ మూవీ ప్రమోషన్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న ఈ చిన్నది. ఈ ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టింది.