NTV Telugu Site icon

Simhadri: అతిపెద్ద స్క్రీన్ పై ‘సింహాద్రి’… ఇదెక్కడి ఫ్యాన్ బేస్ రా సామీ

Simhadri

Simhadri

టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్స్ లో ఒకటైన సింహాద్రి సినిమాని మే 20న ఎన్టీఆర్ బర్త్ డే రోజున రీరిలీజ్ చెయ్యడానికి నందమూరి ఫాన్స్ రెడీ అయిన విషయం తెలిసిందే. చారిటి కోసం ఏర్పాటు చేసిన ఈ రీరిలీజ్ ని ఎన్టీఆర్ ఫాన్స్ అందరూ గ్రాండ్ సక్సస్ చెయ్యాలని ఫిక్స్ అయ్యారు. ఒక రీరిలీజ్ సినిమాకి ముందెన్నడూ చూడని విధంగా సింహాద్రి సినిమాకి ఈవెంట్స్ ని ప్లాన్ చేస్తున్న ఎన్టీఆర్ ఫాన్స్, ఇప్పటికే ఫస్ట్ లుక్ అండ్ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశారు. మే 20న తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా వరల్డ్ వైడ్ సింహాద్రి 4K వెర్షన్ ని రీరిలీజ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ఫాన్స్ కి స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న ప్రతి ఏరియాలో సింహాద్రి సినిమా రిలీజ్ కానుంది. ఒక కొత్త సినిమా రిలీజ్ సమయంలో కూడా చెయ్యని సెలబ్రేషన్స్ ని సింహాద్రి రీరిలీజ్ కి చేసి చూపిస్తాం అంటున్న ఎన్టీఆర్ ఫాన్స్, ఈ రీరిలీజ్ కోసం ఏకంగా వరల్డ్స్ లార్జెస్ట్ IMAX స్క్రీన్ నే బుక్ చేశారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో ప్రపంచంలోనే అతిపెద్ద IMAX స్క్రీన్ ఉంది, ఈ స్క్రీన్ లో సింహాద్రి సినిమా స్పెషల్ షో పడుతుందని ఫాన్స్ అనౌన్స్ చేశారు.

Read Also: Simhadri: అతిపెద్ద స్క్రీన్ పై ‘సింహాద్రి’… ఇదెక్కడి ఫ్యాన్ బేస్ రా సామీ

‘టాలీవుడ్ ఇంటర్నేషనల్’ వాళ్లు సింహాద్రి సినిమాని ఆస్ట్రేలియాలో రిలీజ్ చేస్తున్నారు. మే 20 ఉదయం 9:00 గంటలకి ఈ స్పెషల్ షో పడుతుంది టికెట్స్ బుక్ చేసుకోండి అంటూ అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. ఆస్ట్రేలియాలోనే కాదు డల్లాస్ లాంటి ప్లేసెస్ లో కూడా ఎన్టీఆర్ కి స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ ఏరియాల్లో సింహాద్రి సినిమా రీరిలీజ్ కలెక్షన్స్ రికార్డ్ స్థాయిలో ఉండనున్నాయి. మరి దర్శక ధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో రెండు దశాబ్దాల క్రితం వచ్చి ఇండస్ట్రీ హిట్ అయిన సింహాది సినిమా మే 20న రీరిలీజ్ సంధర్భంగా ఎలాంటి రికార్డ్స్ ని క్రియేట్ చేస్తుందో చూడాలి.

Show comments