NTV Telugu Site icon

Simhadri: నాన్-సింహాద్రి రికార్డ్స్ చూడడానికి రెడీ అవ్వండి…

Simhadri 4k

Simhadri 4k

100 రోజులు 150 సెంటర్స్ లో ఒక సినిమా ఆడింది అంటే మాములు విషయం కాదు. అది కూడా ఒక కుర్ర హీరో సినిమా ఆడింది అంటే అది హిస్టరీలో చిరస్థాయిగా నిలిచిపోవడం గ్యారెంటీ. ఆ హిస్టరీని ౧౯ ఏళ్లకే క్రియేట్ చేసాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. దర్శక ధీరుడు రాజమౌళి, ఎన్టీఆర్ కాంబినేషన్ ని పీక్ స్టేజ్ కి తీసుకోని వెళ్తూ, తెలుగు సినిమ ముందెన్నడూ చూడని హీరో వర్షిప్ ని చూపిస్తూ బయటకి వచ్చిన సినిమా ‘సింహాద్రి’. సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం రిలీజ్ అయిన ఈ మూవీ మాస్ ఆడియన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టింది. సింగమలై అన్నా అనే పిలుపు ఇండస్ట్రీ రికార్డ్స్ ని చాలా కాలం పాటు రూల్ కూడా చేసింది, ఇప్పుడు మరోసారి నాన్-సింహాద్రి రీరిలీజ్ రికార్డ్స్ ని సెట్ చెయ్యడానికి నందమూరి ఫాన్స్ రెడీ అయ్యారు. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా సింహాద్రి సినిమాని రీరిలీజ్ చెయ్యడానికి ఫాన్స్ రెడీ అయ్యారు. రీరిలీజ్ అంటే ఈ మధ్య రెగ్యులర్ గా జరుగుతున్నట్లు కాదు అది ఇంకో రకం అన్నట్లు ఇప్పటివరకూ ఏ రీరిలీజ్ మూవీకి జరగని విధంగా గ్రాండ్ సెలబ్రేషన్స్ తో సింహాద్రి రీరిలీజ్ అవుతోంది.

కేవలం ఓవర్సీస్ లోనే సింహాద్రి సినిమా 100 సెంటర్స్ లో రిలీజ్ అవుతుంది అంటే ఫాన్స్ ఏ రేంజ్ సెలబ్రేషన్స్ ని ప్లాన్ చేసారో అర్ధం చేసుకోవచ్చు. మే 19 సాయంత్రం నుంచే సింహాద్రి రీరిలీజ్ షోస్ అన్ని సెంటర్స్ లో పడనున్నాయి. ఈ రీరిలీజ్ కి ఇంకా 10 రోజులే సమయం ఉండడంతో ఫాన్స్ సింహాద్రి నుంచి సాంగ్స్ ని, ట్రైలర్ ని, పోస్టర్స్ ని రిలీజ్ చేస్తూ హంగామా చేస్తున్నారు. ఇటివలే నువ్వు విజిలేస్తే ఆంధ్రా సోడాబుడ్డి సాంగ్ రిలీజ్ చేసి ఫాన్స్ చేసిన సెలబ్రేషన్స్ చూస్తే ఒక కొత్త సినిమా విడుదల సమయంలో కూడా ఈ రేంజ్ హంగామా చెయ్యరు కదా అనిపించకమానదు. రీరిలీజ్ ట్రెండ్ లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ ని బెంచ్ మార్క్ గా సెట్ అయిన ఎన్టీఆర్ ఫాన్స్ మే 20న ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి.

Show comments