Simbu: కోలీవుడ్ స్టార్ హీరో శింబు పేరు చెప్పగానే.. ఆయన సినిమాలే కాదు.. ఆయన హీరోయిన్లతో నడిపిన ఎఫైర్లు కూడా గుర్తొస్తాయి. శింబు.. అభిమానుల కోసం, సినిమా కోసం ఏదైనా చేస్తాడు. ఒకానొక సమయంలో బరువు పెరిగిన శింబు.. బరువు తగ్గడానికి ఎంత కష్టపడ్డాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ప్రస్తుతం శింబు పాతు తాలా అనే సినిమాలో నటిస్తున్నాడు. మార్చి 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే శింబు ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. ఇక తాజాగా శింబు లుక్ మాత్రం నెట్టింట వైరల్ గా మారింది. సడెన్ గా చూసి ఓరి.. శింబునేనా అనిపించక మానదు.
NTR30: ఎన్టీఆర్ 30 పూజకు గెస్ట్ గా చిరు.. నిజమైతే ఎంత బావుండు
బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ ఫిట్ లో హెయిర్ మొత్తం జడలు వేసుకొని హాలీవుడ్ పాప్ సింగర్ లా దర్శనమిచ్చాడు. లగేజ్ సూట్ కేస్ పట్టుకొని లిఫ్ట్ వద్ద నిలబడి ఉన్న ఫోటో.. ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటోను శింబు ఫ్యాన్స్ సెన్సేషనల్ చేసేస్తున్నారు. పాతుతాలా సినిమాలో శింబు ఒక మాఫియా డాన్ గా కనిపించాడు. చాలా గ్యాప్ తరువాత శింబు ఇలాంటి యాక్షన్ డ్రామా చేస్తున్నాడు. గౌతమ్ కార్తీక్ ఈ సినిమాలో మరో హీరోగా కనిపించనున్నాడు. మరి ఈ సినిమాతో శింబు ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.
