Simbhu: తెలుగు ‘స్టార్’ కూతురితో శింబు పెళ్లి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Simbhu to Marry Telugu Star Actor’s Daughter: తెలుగు చిత్ర పరిశ్రమలోని ఒక స్టార్ యాక్టర్ కూతురిని శింబు త్వరలో పెళ్లాడనున్నాడని, త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని నటుడి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. బాలనటుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన శిలంబరసన్ అలియాస్ శింబు 2002లో కాదల్ విష్ణుతిల్లై చిత్రంతో హీరోగా మారాడు. అప్పటి నుండి శింబు ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించాడు. కెరీర్ మొదటి నుంచి అనేక వివాదాలు ఎదుర్కొన్న శింబు మరెన్నో నెగటివ్ రివ్యూస్ కూడా అందుకున్నాడు. అయితే ఏదేమైనా తమిళ సినిమా అగ్ర కథానాయకులలో ఒకడుగా చక్రం తిప్పుతూనే ఉన్నాడు. శింబు ఇటీవల చేసిన కొన్ని సినిమాలకి మంచి స్పందన లభించింది. కాగా, శింబు దేశింగు పెరియసామి దర్శకత్వంలో తన తదుపరి చిత్రం చేస్తున్నారు.
Shanthi Williams: ముందే చెప్పి చనిపోయాడు.. శవానికి బాయ్ చెప్పి షూట్ కి వెళ్ళా!
Also Read
ఈ చిత్రాన్ని కమల్‌హాసన్‌కు చెందిన రాజ్‌కమల్ ఫిలింస్ నిర్మిస్తోంది. ఒక పక్క ఈ సినిమా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సినీరంగంలో తనకంటూ ఓ స్థానాన్ని రిజర్వ్ చేసుకున్నా శింబు 40 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోకుండానే ఉన్నాడు. అలా అని మనోడు సైలెంట్ అనుకుంటే పొరపాటే. ఎందుకంటే గతంలో శింబు కూడా నయనతారతో ప్రేమలో ఉన్నాడు. అయితే ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత నటి హన్సిక, శింబు ప్రేమలో ఉన్నారని కూడా వార్తలు వచ్చాయి. ఆ ప్రేమ కూడా పెళ్లి వరకు నిలవలేదు. ఇటీవల తెలుగు నటి నిధి అగర్వాల్, శింబు డేటింగ్‌లో ఉన్నట్లు కూడా ప్రచారం జరిగినా అది కూడా కేవలం రూమర్‌గా ముగిసింది. నటుడు శరత్‌కుమార్ కుమార్తె, నటి వరలక్ష్మి కూడా పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరిగింది.
కానీ ఆమె పెళ్లి ప్రకటనతో అది కూడా అబద్ధమని తేలింది. దీంతో ఆయన పెళ్లికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ వస్తోంది. అంతెందుకు కొన్ని నెలల క్రితం కూడా శింబు శ్రీలంకకు చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక ఇన్నేసి వార్తలతో శింబు తండ్రి డి.రాజేందర్ విసిగిపోయాడని ఆయన త్వరలో శింబుకి పెళ్లి చేయాలని అనుకుంటున్నాడని అంటున్నారు. అందుకు తగ్గట్టుగానే తెలుగు చిత్రసీమలోని ప్రముఖ నటుడి కూతురిని శింబు పెళ్లి చేసుకోబోతున్నాడని, త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక సమాచారం వెలువడుతుందని అంటున్నారు. ఈ మేరకు తమిళ మీడియాలో వ్యాపించి అక్కడి సినీ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
-
Mamata Banerjee: “జానీ జానీ ఎస్ పప్పా.. జ్ఞానేశ్ కుమార్ నో పప్పా!”.. ఢిల్లీలో మమతా బెనర్జీ హల్చల్
-
BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
Ranabaali Trailer: ‘రణబాలి’ ట్రైలర్‌పై మంత్రి లోకేష్ రివ్యూ!
ట్రెండింగ్
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!