2 సంవత్సరాల విరామం తరువాత సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. కోవిడ్-19 మహమ్మారి కారణంగా దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డుగా భావించే “సైమా” అవార్డుల ప్రధానం 2020 సంవత్సరంలో జరగలేదు. తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళ పరిశ్రమలలో మల్టిపుల్ క్రాఫ్ట్స్ లో అద్భుతమైన ప్రతిభ కనబర్చిన వారికి “సైమా” అవార్డులు ప్రదానం చేయబడతాయి. ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డు కార్యక్రమం సెప్టెంబర్ 11, 12 తేదీలలో హైదరాబాద్‌లో జరుగుతుంది.
Read Also : అజిత్ కి ప్రేమ, ద్వేషం రెండూ కావాలట!
గత సంవత్సరం మహమ్మారి కారణంగా ఈ వేడుకను నిర్వహించలేకపోయారు. సోషల్ మీడియాలో “సైమా” అవార్డుల ప్రధానోత్సవం” విషయాన్ని నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. చివరగా 2019 ఆగష్టు 15, 16 తేదీల్లో ఎడిషన్ ఖతార్‌లో జరిగింది. “మహానటి” తెలుగులో ఉత్తమ చిత్రంగా, “రంగస్థలం” చిత్రానికి గాను సుకుమార్‌కు ఉత్తమ దర్శకుడు అవార్డు లభించగా, రామ్ చరణ్ అదే చిత్రానికి ఉత్తమ నటుడిగా అవార్డులు లభించాయి. “మహానటి”లో నటనకు గాను కీర్తి సురేష్ ఉత్తమ నటిగా అత్యున్నత స్థాయికి చేరుకుంది.
