Siggu: నేషనల్ అవార్డు డైరెక్టర్ కొత్త సినిమా.. ‘సిగ్గు’ మొదలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Siggu: 1940 లో ఒక గ్రామం అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీని మొత్తం తనవైపు తిప్పుకున్న దర్శకుడు నరసింహా నంది. ఈ సినిమాకు గాను ఆయన జాతీయ అవార్డును సైతం అందుకున్నాడు. ఆ తరువాత కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించినా.. ఆయనకు అంత గుర్తింపు దక్కలేదు. ఇక ఈ మధ్యలో కొంత గ్యాప్ తీసుకున్న నరసింహా నంది.. తాజాగా సిగ్గు అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నూతన నటీనటులతో తెరకెక్కుతున్న ఈ సినిమాను భీమవరం టాకీస్ పతాకంపై రామ సత్యనారాయణ నిర్మిస్తున్నాడు. నేడు ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ముహూర్తపు సన్నివేశానికి జేడీ లక్ష్మీనారాయణ క్లాప్ ఇవ్వగా, కె. విజయేంద్ర ప్రసాద్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. వి వి వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. సి. కళ్యాణ్, దామోదర ప్రసాద్ స్క్రిప్ట్ ను దర్శక నిర్మాతలకు అందించారు.
RGV: పవన్ కళ్యాణ్ నా పోస్టర్ ను కాపీ కొట్టాడు…
Also Read
- Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి 'నో' చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
- Matsya: పడవ కింద నుంచి వెళ్లిన 'మిథికల్ ఫిష్'.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ 'మత్స్య'!
- Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
- Varanasi Update: 'వారణాసి'లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
ఇక పూజ అనంతరం నిర్మాత రామ సత్యనారాయణ మాట్లాడుతూ “నేను చిత్ర పరిశ్రమకి వచ్చి ఖచ్చితంగా 20 సంవత్సరాలు పూర్తయ్యాయి. మొదటి నుంచి నన్ను అభిమానించి అక్కున చేర్చుకున్న వ్యక్తి కళ్యాణ్ గారు. ఆయన సపోర్ట్‌తో ముందుకెళ్తున్నాను” అని అన్నారు. ఇక జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ “సామాజిక స్పృహ కలిగిన సినిమాలు తీయాలని సమాజాన్ని పాడు చేసే సినిమాలు తీయకూడదు అని నేను క్లాప్ కొట్టాను. కాబట్టి మంచి సినిమా తీయించే బాధ్యత ఈ బృందంపై ఉంది. ఆ నమ్మకంతోనే క్లాప్ కొట్టాను” అని చెప్పుకొచ్చారు.
Keerthy Suresh: మహానటి బాలీవుడ్ ఎంట్రీ.. సమంత హీరోతో రొమాన్స్.. ?
దర్శకుడు నరసింహా నంది మాట్లాడుతూ “రామ సత్యనారాయణగారి బ్యానర్లో గతంలో కూడా పని చేశా. నాపై నమ్మకంతో ఆయన ఏరోజు కూడా సెట్లో అడుగుపెట్టరు. పూర్తి స్వేచ్ఛ ఇస్తారు. ఆ నమ్మకంతోనే నాకు మళ్లీ అవకాశం ఇచ్చారు. చలం గారి నవల సుశీల ఆధారంగా ఈ సినిమా చేస్తున్నా. నాకు రెగ్యులర్ గా వర్క్ చేసే టీమ్ ఈ సినిమాకి వర్క్ చేస్తున్నారు. నటీనటుల ఎంపిక పూర్తయిన తర్వాత ఇతర వివరాలు వెల్లడిస్తా” అన్నారు. మరి ఈ సినిమాతో ఈ టీమ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి ‘నో’ చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Matsya: పడవ కింద నుంచి వెళ్లిన ‘మిథికల్ ఫిష్’.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ ‘మత్స్య’!
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!