NTV Telugu Site icon

Siddhu Jonnalagadda: లవర్స్ డే సందర్భంగా సిద్ధు జొన్నలగడ్డ మూవీ రీ రిలీజ్..

February 7 (17)

February 7 (17)

ఈమద్య కాలంలో రీ రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తోంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా వరుస సినిమాలు సందర్భని బట్టి విడుదలవుతూ వస్తున్నాయి. ఇందులో భాగంగా ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు సందర్భంగా యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ కూడా మాస్టర్ ప్లాన్ తో రాబోతున్నాడు. ఇంతకీ ఏంటా ప్లాన్ అంటే..

Also Read:Regina Cassandra: ఆయన ఇంత పెద్ద హీరో ఎలా అయ్యాడో తెలీడంలేదు: రెజీనా

బాక్సాఫీస్ వద్ద మాస్ హీరోల్లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న సిద్దు జొన్నలగడ్డ ఈ మధ్య సినిమాల పరంగా బాగానే గ్యాప్ ఇచ్చాడు. ‘డీజే టిల్లు’ తర్వాత ‘టిల్లు స్క్వేర్’ కోసం రెండేళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది. మళ్లీ ఇప్పటి వరకు తాను ఒక ప్రాజెక్ట్ కూడా ప్రకటించలేదు. కానీ సమాచారం ప్రకారం సిద్ధు ఇప్పుడు సెట్స్ మీద ఒకేసారి మూడు సినిమాలు షూటింగ్ లో పెట్టేశాడట. అలాగే ఫ్యాన్స్ కోసం ఒక రీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నాడట. ఎంటా మూవీ అంటే 2020 లో సిద్ధు నటించిన  చిత్రం ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ . రవికాంత్ పేరేపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్, సీరత్ కపూర్, షాలిని వడ్నికట్టి హీరోయిన్లుగా నటించారు. నేరుగా ఓటీటీ ద్వారా రిలీజైన ఈ ఎంటర్టైనర్ మూవీకి యూత్ నుండి భారీ స్పందన లభించింది.

అయితే ఈ మూవీని తాజాగా ‘ఇట్స్ కాంప్లికేటెడ్’ అనే కొత్త టైటిల్ తో  ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు సందర్భంగా థియేట్రికల్‌గా రీ రిలీజ్ కి ప్లాన్ చేశారు. దగ్గుబాటి రానా సమర్పిస్తున్న ఈ మూవీ కోసం ప్రత్యేకంగా ప్రమోషన్లు కూడా చేయబోతున్నారు. ఇందులో భాగంగానే రీసెంట్ గా చిన్న ప్రోమో కూడా వదలగా, చూస్తుంటే సినిమాలో మిస్ అయిన సీన్లు, ఫుటేజ్ ఇప్పుడు కొత్త వెర్షన్ లో చూసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.