ప్రస్తుతం చిత్ర పరిశ్రమ అంతా పాన్ ఇండియా సినిమాలు నిర్మించడంలో తలమునకలైపోయింది. ఎక్కడ విన్నా`బాహుబలి`…`కేజీఎఫ్`..`ఆర్ ఆర్ ఆర్`..`పుష్ప’ సినిమాల గురించే చర్చ.. ఇక ఈ పాన్ ఇండియా పదం తో సౌత్ వర్సెస్ నార్త్ నటులు మాటల యుద్ధం చేస్తున్న విషయం విదితమే. ఇక ఈ విషయంపై వివాదాల హీరో సిద్దార్థ్ స్పందించాడు. మనుసులో ఏది అనిపిస్తే అది నిర్మొహమాటం లేకుండా ట్వీట్ చేసి అందరి చేత విమర్శలు అందుకునే ఈ హీరో మరోసారి పాన్ ఇండియా పై సంచలన వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ గా మారాడు. ” పాన్-ఇండియన్ అనేది చాలా అగౌరవకరమైన పదం. పాన్-ఇండియన్ అనేది నాన్సెన్స్.. ఇక్కడ నిర్మించే అన్ని చిత్రం భారతీయ చిత్రాలే.. ఇప్పుడు మాత్రం పాన్ ఇండియా మూవీ వచ్చిందా..? 15 సంవత్సరాల క్రితం పాన్-ఇండియన్ సినిమా లేదా.. నా బాస్ మణిరత్నం ‘రోజా’ అనే సినిమా తీశారు. ఈ సినిమా భారతదేశంలోని ప్రతి ఒక్కరూ చూసారు. చూడని వారు అంటూ ఎవరూ లేరు.
ఇక ఇటీవలే నా స్నేహితులు ‘కెజిఎఫ్’ సినిమా తీశారు.. అది ఒక భారతీయ సినిమా.. వారిని చూసి గర్వపడుతున్నాను. సినిమాను మీకు నచ్చిన భాషలో చూసే హక్కు ప్రేక్షకులకు ఉంటుంది. ఇది భారతీయ సినిమా .. కన్నడ పరిశ్రమ ఈ సినిమాను తయారుచేసింది. అస్సలు పాన్ ఇండియా.. పాన్ ఇండియా అని ఒకటే రచ్చ చేస్తున్నారు. నాకు తెలిసి పాన్ ఇండియా అనే పదమే తీసివేయాలి. దాని ప్లేస్ లో భారతీయ సినిమా అని పెట్టాలి.. అందరు అలాగే పిలవాలి. లేదా ఆ సినిమా ఏ భాషలో రూపొందిందో ఆ భాషతోనే పిలవాలి.. ఇది కన్నడ సినిమా, తెలుగు సినిమా అని.. నేను తమిళం.. తెలుగు సినిమాల్లో స్టార్డమ్ సంపాదించి బాలీవుడ్ కు వెళ్లినా నన్ను సౌత్ యాక్టర్ అనే అంటారు కానీ సౌత్ ఇండియన్ యాక్టర్ అనరు.
ఒక సినిమా గొప్పగా రావాలంటే ఎంతోమంది టెక్నీషయన్లు కావాలి. వారికి భాషా భేదం ఉండదు.. తమిళ్ టెక్నీషయన్లు హిందీలో వర్క్ చేయడం లేదా..? తెలుగు నిర్మాతలు హిందీలో సినిమాలు తీయడం లేదా..? కంటెంట్ బావుంటే ఏ సినిమా అయినా,. ఏ భాషలోనైనా హిట్ అవుతుంది. దానికి పాన్ ఇండియా అని చెప్పి బిల్డప్ ఇవ్వాల్సిన అవసరం లేదు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సిద్దు వ్యాఖ్యలు ఇండస్ట్రీలో కలకలం రేపుతున్నాయి.