Siddharth: బొమ్మరిల్లు సినిమాతో ఎప్పటికి తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాడు సిద్దార్థ్. ఆ మధ్యకాలంలో తెలుగుకు దూరమైనా సోషల్ మీడియాలో మాత్రం అన్ని భాషల ప్రేక్షకులకు దగ్గరగా ఉంటూనే వస్తున్నాడు. ఇక సిద్దు ఎఫైర్స్ గురించి, బ్రేకప్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సమంత పెళ్లి అవ్వనంత వరకు ఆమెతో రిలేషన్ లో ఉన్నాడని వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. ఇక గత కొంత కాలంగా ఈ హీరో, హీరోయిన్ అదితి రావు హైదరితో రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఎక్కడ చూసినా ఈ జంట ఒక్కటిగానే కనిపిస్తున్నారు. ఫంక్షన్స్, ఈవెంట్స్ చివరికి ముంబై వీధుల్లో చెట్టాపట్టాలేసుకొని వెళ్తూ కెమెరా కంటికి చిక్కారు. దీంతో వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుందని అనుమానాలు వ్యక్తమయ్యాయి.
ఇక ఆ అనుమానాన్ని నేడు నిజం చేసేసాడు సిద్దు. నేడు అదితి పుట్టినరోజు సందర్భంగా ఆమెకు ఎంతో స్పెషల్ గా విషెస్ తెలుపుతూ తన ప్రేమ వ్యవహారం నిజమే అని చెప్పుకొచ్చాడు. ” నా హృదయ రాకుమారి అదితిరావు హైదరి హ్యాపీ హ్యాపీ బర్త్ డే.. నీ కలలన్ని నిజం కావాలని కోరుకుంటున్నాను. నా జీవితంలో ఇది బెస్ట్ ట్రిప్.. ” అంటూ రాసుకొచ్చాడు. ఇక ఆ ఫోటోలో సైతం సిద్దు ఎదపై వాలిపోయి అదితి కనిపించింది. దీంతో ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారని బీ టౌన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఈ జంట తెలుగులో మహా సముద్రం సినిమాలో కలిసి నటించారు. అప్పటి నుంచి వీరి మధ్య ప్రేమ చిగురించిందని తెలుస్తోంది.
