Siddharth: అదితిరావు తో ఎఫైర్.. అఫీషియల్ చేసేసిన సిద్దార్థ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Siddharth: బొమ్మరిల్లు సినిమాతో ఎప్పటికి తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాడు సిద్దార్థ్. ఆ మధ్యకాలంలో తెలుగుకు దూరమైనా సోషల్ మీడియాలో మాత్రం అన్ని భాషల ప్రేక్షకులకు దగ్గరగా ఉంటూనే వస్తున్నాడు. ఇక సిద్దు ఎఫైర్స్ గురించి, బ్రేకప్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సమంత పెళ్లి అవ్వనంత వరకు ఆమెతో రిలేషన్ లో ఉన్నాడని వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. ఇక గత కొంత కాలంగా ఈ హీరో, హీరోయిన్ అదితి రావు హైదరితో రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఎక్కడ చూసినా ఈ జంట ఒక్కటిగానే కనిపిస్తున్నారు. ఫంక్షన్స్, ఈవెంట్స్ చివరికి ముంబై వీధుల్లో చెట్టాపట్టాలేసుకొని వెళ్తూ కెమెరా కంటికి చిక్కారు. దీంతో వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుందని అనుమానాలు వ్యక్తమయ్యాయి.
ఇక ఆ అనుమానాన్ని నేడు నిజం చేసేసాడు సిద్దు. నేడు అదితి పుట్టినరోజు సందర్భంగా ఆమెకు ఎంతో స్పెషల్ గా విషెస్ తెలుపుతూ తన ప్రేమ వ్యవహారం నిజమే అని చెప్పుకొచ్చాడు. ” నా హృదయ రాకుమారి అదితిరావు హైదరి హ్యాపీ హ్యాపీ బర్త్ డే.. నీ కలలన్ని నిజం కావాలని కోరుకుంటున్నాను. నా జీవితంలో ఇది బెస్ట్ ట్రిప్.. ” అంటూ రాసుకొచ్చాడు. ఇక ఆ ఫోటోలో సైతం సిద్దు ఎదపై వాలిపోయి అదితి కనిపించింది. దీంతో ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారని బీ టౌన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఈ జంట తెలుగులో మహా సముద్రం సినిమాలో కలిసి నటించారు. అప్పటి నుంచి వీరి మధ్య ప్రేమ చిగురించిందని తెలుస్తోంది.
Also Read
తాజావార్తలు
-
AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్‌వేవ్స్ హెచ్చరిక
-
Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
-
Explainer: పిడుగులు చంపుతున్నాయ్.. తెలుగు రాష్ట్రాలకు డేంజర్ అలెర్ట్!
-
Seyon: కమల్ హాసన్ నిర్మాణంలో శివకార్తికేయన్ మాస్ అవతార్
-
Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్‌పై బైరెడ్డి విమర్శలు..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..