NTV Telugu Site icon

Siddharth Roy Teaser: మరో ‘అర్జున్ రెడ్డి’ లా ఉంది.. ‘అతడు’ బుడ్డోడుకు హిట్ అందేనా

Sid

Sid

Siddharth Roy Teaser: చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ గురించి అందరికి తెల్సిందే. తేజ సజ్జా తరువాత అంతటి పాపులారిటీని తెచ్చుకున్న బుడ్డోడు అంటే దీపక్ అనే చెప్పాలి. ముఖ్యంగా అతడు సినిమాలో బ్రహ్మానందం కొడుకుగా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ బుడ్డోడే ఇప్పుడు హీరోగా మారాడు. సిద్దార్థ్ రాయ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. వి యశస్వి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ రహదా దామోదర్ స్టూడియోస్
విహాన్ మరియు విహిన్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ ను చూస్తుంటే.. అర్జున్ రెడ్డి మరో వెర్షన్ లా అనిపిస్తుంది. టాలీవుడ్ సినీ చరిత్రను మార్చేసిన సినిమాగా అర్జున్ రెడ్డిని చెప్పుకోవచ్చు. బోల్డ్ కంటెంట్ అని వివాదాలు ముసిరినా అందులో ఉన్న లవ్ స్టోరీకి ఫ్యాన్స్ మాములుగా లేరు. ఇక ఈ సిద్దార్థ్ రాయ్ కూడా అలాగే కనిపిస్తుంది.

Allu Aravind: అల్లు అరవింద్ అన్నది మహేష్ బాబు డైరెక్టర్ నేనా..?

భగవద్గీత శ్లోకంతో మొదలైన టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. సిద్దార్థ్ రాయ్ అనే కుర్రాడి క్యారెక్టర్ గురించిన ఎలివేషన్స్ ఇస్తూ.. టీజర్ ను నింపేశాడు డైరెక్టర్. తిండి, నిద్ర, సెక్స్ తప్ప ఎలాంటి ఎమోషన్స్ లేని ఒక అబ్బాయి కథగా చూపించారు. లాజిక్స్.. లాజిక్స్ అంటూ జీవితం మొత్తం ఇలా నాశనం చేసుకున్నాడు అని, మూడ్ వస్తే .. ఎదురుగా ఉన్నది ఎవరు అని కూడా ఆలోచించకుండా వారితో సెక్స్ చేస్తాడు అని చెప్పడం మరింత ఘాటుగా ఉన్నాయి. అయితే అసలు సిద్దార్థ్ రాయ్ ఎవరు..? అతడి జీవితం ఎందుకు ఇలా అయ్యింది..? అతని జీవితంలో ఉన్న అమ్మాయి ఎవరు అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. బోల్డ్ కంటెంట్ లానే కనిపిస్తున్నా.. అర్జున్ రెడ్డి లనే లవ్ స్టోరీ ఉన్నట్లు తెలుస్తోంది. దీపక్ మిణుగురులు లాంటి క్లాసిక్ సినిమా తరువాత .. ఇలాంటి రా అండ్ రస్టిక్ లుక్ లో బాగానే కనిపించాడు. ఇక రాదాన్ ఈ సినిమాకి సంగీతం అందించడం విశేషం. ప్రస్తుతం ఈ టీజర్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో ఈ బుడతడు ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.

Show comments