NTV Telugu Site icon

Pathaan Bikini Row: పఠాన్ బికినీ వివాదం.. ఎట్టకేలకు నోరు విప్పిన డైరెక్టర్

Siddharth Anand On Bikini

Siddharth Anand On Bikini

Siddharth Anand Reacts On Pathaan Orange Bikini Controversy: పఠాన్ సినిమాలోని బేషరం రంగ్ పాటలో దీపికా పదుకొణె వేసుకున్న బికినీపై అప్పట్లో ఎంత దుమారం రేగిందో అందరికీ తెలుసు. ఆ దుస్తులు కాషాయం రంగులో ఉండటంతో.. హిందూ సంఘాలు సహా రాజకీయ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఆ దుస్తులున్నాయని.. ఆ సన్నివేశాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ వివాదం ఎంత ముదిరిందంటే.. సినిమానే బాయ్‌కాట్ చేయాలని నిరసన వెల్లువెత్తింది. కొన్ని చోట్లైతే.. పోస్టర్లు అతికించిన థియేటర్లపై దాడి చేశారు. సినిమా విడుదలని ఆపేయాలంటూ.. ఆయా థియేటర్లకు వెళ్లి హంగామా సృష్టించారు. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను రద్దు చేసుకుంది. ఒకవేళ ప్రమోషన్స్ నిర్వహిస్తే.. ఆ వివాదం తమ సినిమాపై ప్రభావం చూపుతుందని సైలెంట్ అయ్యారు. అనంతరం సినిమా విడుదల అవ్వడం, బాయ్‌కాట్ ట్రెండ్‌ని పట్టించుకోకుండా థియేటర్లపై ప్రేక్షకులు దండయాత్ర చేయడం, ఇది కలెక్షన్ల సునామీ సృష్టించడం జరిగింది.

Celina Jaitly: వాళ్లు అడుక్కోరు.. తప్పుగా ప్రవర్తిస్తారు.. నెటిజన్‌కి సెలీనా గుణపాఠం

ఇప్పుడెలాగో తమ సినిమా ఘనవిజయం సాధించింది కాబట్టి.. ఆ బికినీ వివాదంపై దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ స్పందించాడు. ‘‘మేము ఆ పాటను స్పెయిన్‌లో చిత్రీకరించాలని అనుకున్నప్పుడు.. అక్కడి పరిస్థితుల్ని చూసి ఆరెంజ్ రంగు దుస్తులైతే బాగుంటుందని అనుకున్నాం. సన్నీగా వెదర్, పచ్చగా వెడ్డి, బ్యాక్‌గ్రౌండ్‌లో బ్లూ రంగులోని వాటర్‌ని చూసి.. ఆరెంజ్ రంగు దుస్తులు వేస్తే బాగా హైలైట్ అవుతుందని భావించాం. అందుకే దుస్తులు దీపికాకి తొడిగించాం. అంతే తప్ప.. మరే దురుద్దేశంతోనో ఆ దుస్తులు వేయలేదు. ఇక ఈ సినిమా చూసేందుకు జనాలు ఎగబడటం, బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల కలెక్షన్లు రావడం చూశాక.. బాయ్‌కాట్ ట్రెండ్ అనేది తప్పని తేలింది’’ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా.. ఎన్నో వివాదాల మధ్య విడుదలైన పఠాన్ సినిమా, తొలిరోజు పాజిటివ్ టాక్‌ని మూటగట్టుకోవడంతో బాక్సాఫీస్‌తో చెడుగుడు ఆడేసుకుంది. కలెక్షన్ల సునామీ సృష్టించి.. బాహుబలి 2 రికార్డులను బద్దలుకొట్టి.. బాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.

NTR30: వేట మొదలుపెట్టిన తారక్.. వీడియో వైరల్