Siddharth- Aditi: సాధారణంగా ఎవరి పెళ్లికి వెళ్లినా అందరి అటెన్షన్ పెళ్లి కొడుకు- పెళ్లి కూతురు మీద ఉంటాయి. కానీ ఈ జంట ఏ పెళ్ళికి వెళ్లినా అందరి చూపు వీరి మీదనే ఉంటుంది. అంత ఫేమస్ జంట.. సిద్దార్థ్- అదితి రావు హైదరీ. వీరి ప్రేమాయణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహా సముద్రం సినిమా సమయంలో వీరి మధ్య పరిచయం.. ప్రేమగా మారింది. ప్రస్తుతం ఇద్దరు ఒకే ఇంట్లో సహజీవనం చేస్తున్నారు. అయితే వీరి మధ్య రిలేషన్ ఏంటి అనేది వారెప్పుడు బయటపెట్టింది లేదు. కానీ, ఎక్కడకు వెళ్లినా జంటగా వెళ్తారు.. జంటగా కనిపిస్తారు. ఇక తాజాగా ఈ జంట శర్వా పెళ్ళిలో సందడి చేశారు. జైపూర్ లో జరిగిన శర్వా పెళ్ళిలో సిద్దు సాంగ్ పాడి అలరించిన విషయం తెల్సిందే.
Varun Tej: బాబాయ్ ను ఫాలో అయిన అబ్బాయ్ .. మెగా ఇంట ఇది రెండోది
సిద్దు, శర్వా, అదితి కలిసి మహాసముద్రం సినిమాలో నటించారు. అప్పటినుంచి వీరు ముగ్గురు ఫ్రెండ్స్. శర్వా ఎంగేజ్ మెంట్ లో కూడా వీరు జంటగా వచ్చి సందడి చేశారు. ఇక తాజాగా శర్వా పెళ్లి వేడుక నుంచి ఈ ఫోటో బయటపడింది. బ్లాక్ సూట్ లో సిద్దు కనిపించగా.. గోల్డ్ కలర్ చీరలో అదితి యువరాణిలా మెరిసిపోతుంది. నిజం చెప్పాలంటే.. శర్వా పెళ్ళిలో అందరి చూపు వీరి మీదనే ఉందట. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే నేడు శర్వా రిసెప్షన్ కు ఈ జంట హాజరవుతున్నారా..? లేదా ..? అనేది తెలియాల్సి ఉంది.