Site icon NTV Telugu

Shyamala Devi: ఎన్టీఆర్- ప్రభాస్ బాండింగ్.. బయట ఇలా ఉంటుందని ఎవరు అనుకోరు..

Ntr

Ntr

Shyamala Devi: ఫ్యాన్స్ వార్.. సోషల్ మీడియా వచ్చాకా ఇవి బాగా ఎక్కువ అయ్యాయి. ఒకప్పుడు ఫ్యాన్స్.. సినిమా హిట్ అయ్యిందా.. ? లేదా అనేదానిమీద కొట్టుకొనేవారు. కానీ, ఇప్పుడు తమ అభిమాన హీరోలను ఎవరైనా ఏదైనా అనడం ఆలస్యం.. ఆ హీరోల ఫోటోలను ఎడిట్ చేయడం, వారిని బాడీ షేమింగ్ చేయడం, వారి పర్సనల్ విషయాలను పబ్లిక్ చేసి తిట్టడం చేస్తూ.. ఇదే మా అభిమానం అని చూపిస్తున్నారు. అయితే.. ఒక ఈవెంట్ లో మహేష్ బాబు అన్నట్లు.. మేము మేము బాగానే ఉంటాం.. మీరే మారాలి అని చెప్పినా కూడా ఈ ఫ్యాన్స్ మాత్రం అస్సలు మారడం లేదు. ఇక ఫ్యాన్స్ ను పక్కన పెడితే.. టాలీవుడ్ లో హీరోలందరూ కలిసికట్టుగా ఉంటారు అనేది వాస్తవం. ముఖ్యంగా డార్లింగ్ ప్రభాస్ అంటే.. టాలీవుడ్ లోనే కాదు ఇండస్ట్రీలో నచ్చని సెలబ్రిటీ లేరు అంటే అతిశయోక్తి కాదు. అంతలా డార్లింగ్ అందరి మనసులను గెలుచుకుంటాడు.

ఇక చిత్ర పరిశ్రమలో డార్లింగ్ కు ఫ్రెండ్స్ చాలా తక్కువ. కానీ, ఆ తక్కువ ఫ్రెండ్స్ ను అస్సలు వదలడు. ఇక ఆ ఫ్రెండ్స్ లిస్ట్ లో ఎన్టీఆర్ కూడా ఉన్నాడు. ఈ విషయాన్నీ ప్రభాస్ పెద్దమ్మ, కృషంరాజు భార్య శ్యామలా దేవి తెలిపింది. కృషంరాజు, ప్రభాస్ పేరు చెప్పగానే ఎవరికైనా గుర్తొచ్చేది ఫుడ్.. ఎవరు కాల్ చేసినా, ఇంటికి వచ్చినా వారందరూ అడిగే మొదటి ప్రశ్న.. ఏం బాబు తిన్నారా.. ? అని. ఇక అలానే ఎన్టీఆర్ ను కూడా ప్రభాస్ ఫుడ్ పెట్టి చంపేశాడట. తాజాగా టీవీ షోలో పాల్గొన్న శ్యామలా దేవి ఎన్టీఆర్- ప్రభాస్ మధ్య ఉన్న బాండింగ్ ను బయటపెట్టింది. ” ప్రభాస్ ఫోన్ చేసి.. తారక్ ఎక్కడున్నావ్.. వచ్చేయాలి భోజనానికి అంటే.. తారక్.. తండ్రీకొడుకులు ఎక్కడున్నా వదలరు.. భోజనాలు పెట్టి చంపేస్తారు వీళ్లు” అని అన్నట్లు తెలిపింది. దీంతో బయట ఈ హీరోల బాండింగ్ ఇలా ఉంటుందా.. ? అని అభిమానులు ముక్కున వేలేసుకుంటున్నారు. అందుకే మహేష్.. మేము మేము బాగానే ఉంటాం అని చెప్పింది అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version