Site icon NTV Telugu

Shweta Tiwari: 45 ఏళ్ల వయసు, ఇద్దరు పిల్లల తల్లి.. కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీనిస్తున్న శ్వేతా తివారీ!

Shweta Tiwari Cover

Shweta Tiwari Cover

శ్వేత తివారీ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్ బీటౌన్‌లో పలు సీరియల్స్‌, షోలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ‘కసౌతి జిందగీ కే’ సీరియల్ ద్వారా టీవీ రంగంలోకి అడుగు పెట్టడమే కాదు.. బుల్లి తెరను ఊపేశారు.

మేరే డాడ్ కి దుల్హాన్, బాల్వీర్ వంటి షోలు కూడా శ్వేత తివారీ చేశారు. వరుసగా సీరియల్స్, షోలు చేస్తూ స్టార్‌గా ఎదిగారు. ఆ క్రేజ్‌తో అనేక చిత్రాలలో కూడా నటించారు. ప్రస్తుతం ఆమె సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలో కూడా నటిస్తున్నారు.

18 ఏళ్ల వయసులోనే భోజ్‌పురి నటుడు రాజా చౌదరిని శ్వేత తివారీ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు పాలక్ తివారీ అమ్మాయి ఉంది. అయితే ఈ వివాహం ఎక్కువ కాలం నిలవలేదు.

2013లో నటుడు అభినవ్ కోహ్లీని శ్వేత తివారీ వివాహం చేసుకోగా.. ఈ జంటకు కుమారుడు రేయాన్ష్ పుట్టాడు. మూడేళ్లకే ఆమె విడాకులు తీసుకునారు. రెండుసార్లు విడాకుల అనంతరం శ్వేత తివారీ ఒంటరిగా ఉండిపోయారు.

శ్వేత తివారీ ప్రస్తుతం తన కూతురు, కొడుకును అన్నీ తానై చూసుకుంటున్నారు. సీరియల్స్, షో, సినిమాలు చేస్తూ.. బిజీగా ఉన్నారు. దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న టీవీ నటి శ్వేత తివారీ.

శ్వేత తివారీ ఎప్పటికపుడు తన పోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. 45 ఏళ్ల వయసు, ఇద్దరు పిల్లల తల్లి అయినా ఏమాత్రం తగ్గని అందంతో కుర్రకారును కట్టిపడేస్తున్నారు.

శ్వేత తివారీ ఫిట్‌నెస్, అందం చూస్తే.. 45 ఏళ్లా అని ఆశ్చర్యపోతున్నారు. తాజా ఫోటోలలో శ్వేత చాలా విభిన్న శైలిలో పోజులిచ్చారు. ఆమె స్టైలిష్ లుక్ కుర్రకారు గుండెలను పిండేస్తోంది. కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీనిస్తున్న శ్వేతా తివారీ అని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version