Site icon NTV Telugu

Shruti Haasan: ఆ పాత్ర చేసి నేను చాలా పెద్ద తప్పు చేశాను

shruti hassan

shruti hassan

స్టార్స్ గా కొనసాగుతున్న ప్రతి హీరో, హీరోయిన్లకు తాము నటించిన పాత్రలు నచ్చవు.. కానీ చేయాల్సి వస్తుంది. అయితే వాటి గురించి చాలా ప్రత్యేకమైన సందర్భాలల్లోనే నోరు విప్పుతుంటారు. తాజాగా స్టార్ హీరోయిన్ శృతి హాసన్ తన కెరీర్ లో ఒక పాత్రను చేసి తప్పుచేశానని చెప్పుకొచ్చింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతి.. ప్రేమమ్ లో నటించి తప్పు చేశాను అని తెలిపింది. మలయాళ ప్రేమమ్ రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో శృతి, సాయి పల్లవి పాత్ర పోషించింది.

నాగ చైతన్య హీరోగా నటించిన ఈ సినిమా తెలుగులో విజయాన్ని అందుకున్నా ట్రోల్స్ బారిన పడింది. మళయాలంలో సాయి పల్లవిని, తనను కంపేర్ చేస్తూ ట్రోల్స్ వేశారని, వాటిని చూసి నేను చాలా బాధపడ్డానని చెప్పుకొచ్చింది. అసలు సినిమాలో నటించకుండా ఉండాల్సింది అని ఒకానొక సమయంలో బాగా ఫీల్‌ అయ్యానని, కానీ ఆ పాత్రలో నటించనన్ని రోజులు ఎంజాయ్ చేసినట్లు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వైకాయ్లు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే ప్రస్తుతం శృతి సలార్ , బాలకృష్ణ – గోపీచంద్ మలినేని చిత్రంలో నటిస్తోంది.

Exit mobile version