Site icon NTV Telugu

బాయ్ ఫ్రెండ్ తో శృతి హాసన్ రొమాంటిక్ గా… లక్కీ గర్ల్!

Shruthi-Haasan

స్టార్ హీరోయిన్ శృతిహాసన్‌కి సంబంధించి రోజుకో వార్త వస్తూనే ఉన్నాయి. సినిమాల కంటే తన రిలేషన్ షిప్ గురించే ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. ఆమె దాదాపు ప్రతిరోజూ సోషల్ మీడియాలో ఆసక్తికర ఫోటోలను పోస్ట్ చేస్తూనే ఉంటుంది. ఆమె అందమైన చిత్రాలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతాయి. ఇప్పుడు మరోసారి ఒక చిత్రాన్ని పంచుకుంటూ శృతిహాసన్‌ తనను తాను ‘లక్కీ గర్ల్’గా అభివర్ణించింది. శృతి హాసన్ డూడుల్ ఆర్టిస్ట్ శాంతాను హజారికాతో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా శాంతాను హజారికాతో కలిసి ఉన్న ఓ రొమాంటిక్ పిక్ ను షేర్ చేసింది. ఈ పిక్ ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ “అతను నన్ను నవ్విస్తాడు… అది ప్రత్యేకమైన నవ్వు” అని క్యాప్షన్‌ రాసింది.

Read Also : హీరోయిన్ అంటే గ్లామర్ మాత్రమే కాదు… సామ్, నయన్ పై ప్రియమణి కామెంట్స్

ఇంకా శాంతను రూపొందించిన తన గోత్-థీమ్ కేక్ చిత్రాన్ని చేస్తూ తనను తాను ‘లక్కీ గర్ల్’ అని పిలుచుకుంది ఈ బ్యూటీ. మొదట్లో శృతి హాసన్ శాంతను హజారికాతో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు వచ్చిన వార్తలను కొట్టి పారేసింది. అయితే తరువాత ఆమె స్వయంగా అంగీకరించింది. అతనితో కలిసి ఉన్న పిక్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ప్రారంభించింది. శృతి హాసన్, ఆమె ప్రియుడు శాంతాను హజారికా చాలా కాలం నుంచి ప్రేమలో ఉన్నారు. వారు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికి తగినంత సమయాన్ని వెచ్చించడంతో వారి సంబంధం మరింత బలపడుతోంది.

Exit mobile version