Site icon NTV Telugu

Shruti Haasan : స్టేజిమీద మాస్ పాట పాడిన శృతిహాసన్..

Shruti Haasan

Shruti Haasan

Shruti Haasan : హీరోయిన్ శృతిహాసన్ కు అన్ని భాషల్లో అభిమానులు ఉన్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న ఈ బ్యూటీ.. మల్టీ ట్యాలెంటెడ్ అనే విషయం తెలిసిందే. తాజాగా స్టేజి మీదనే పాటపాడి అందరినీ అలరించేసింది. కమల్ హాసన్ నటిస్తున్న తాజా మూవీ థగ్ లైఫ్. ఈ సినిమా జూన్ 5న రాబోతోంది. మణిరత్నం దర్శకత్వంలో చాలా ఏళ్ల తర్వాత కమల్ హాసన్ నటిస్తున్న మూవీ కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఈ మూవీలో శింబు, త్రిష కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Read Also : High Court: అత్యాచార బాధిత, మైనర్ బాలిక ప్రసవానికి హైకోర్టు అనుమతి..

ఈ సినిమాలో శృతిమాసన్ ‘విన్వెళి నాయగ’ అనే పాట పాడిన విషయం తెలిసిందే. తాజాగా చెన్నైలో ఆడియో లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ స్టేజి మీద శృతి లైవ్ లో అందరి ముందు ఆ పాట పాడి అదరగొట్టింది. చీరకట్టులో మెరిసిన శృతి.. ఏ మాత్రం తడబడకుండా.. లిరిక్స్ చూడకుండానే పాట పాడేసి అందరినీ అబ్బురపరిచింది. ఆ పాట మూవీలో కమల్ పాత్రను హైలెట్ చేసేది. ఆ మాస్ సాంగ్ ను శృతి అదరగొట్టేసింది. శృతి హాసన్ లో ఈ ట్యాలెంట్ కూడా ఉందా అంటూ కామెంట్లు పెడుతున్నారు శృతి హాసన్.

Read Also : OG : ఓజీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

Exit mobile version