సినిమాల్లో ఎంత గ్లామరస్‌గా కనిపించినా, సోషల్ మీడియాలో స్టైల్‌కి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఆ లిస్టులో ముందుండే హీరోయిన్ శ్రుతి హాసన్. ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేస్తే చాలు ఫొటో వెనక ఫొటోలో బ్లాక్ కలర్ దుస్తులు మాత్రమే వరుసగా కనిపిస్తాయి. దాదాపు 90% ఫొటోలు ఈ ఒక్క రంగులోనే ఉంటే, ఈ నలుపు పై ఆమె ప్రేమ ఎంత అనేది అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ ప్రేమ వెనుక అసలైన కారణం ఏమిటి? అదే శ్రుతి మాటల్లో..
Also Read : Sandeep Reddy Vanga : బోల్డ్ డ్యూటికి అండగా నిలిచిన సందీప్ రెడ్డి వంగా..
“బ్లాక్ కలర్ వేసుకుంటే మనం ఎక్కడ ఉన్నా అందరి మధ్య ప్రత్యేకంగా కనిపిస్తాం. నా స్కిన్ టోన్‌కి ఈ రంగు అద్భుతంగా సూటవుతుంది. కొందరికి నలుపు అశుభం అని అనిపించొచ్చు, కానీ నా వరకు అది ఆనందం, కాన్ఫిడెన్స్ ఇచ్చే రంగు. ఏదైనా పనిలో ‘చేయగలనా? లేదా?’ అనే అనుమానం వచ్చినప్పుడు, బ్లాక్ డ్రెస్ వేసుకుంటే నాలో ఒక ధైర్యం వస్తుంది. సాధారణ రంగులతో పోలిస్తే, బ్లాక్ వేసుకున్నప్పుడు నేను రెట్టింపు ఉత్సాహంగా ఉంటాను. ముఖ్యంగా డార్క్ కలర్స్ వేసుకుంటే బయటకి వెళ్లినప్పుడు కెచెప్ లేదా ఇతర మరకలు పడినా ఎవరికీ సులభంగా కనిపించవు. అందుకే బ్లాక్ కలర్ చాలా సేఫ్ ఛాయిస్ అనిపిస్తుంది’ అని నవ్వుతూ చెప్పింది. ఇంతటితో ఆగలేదు. శ్రుతి హాసన్‌కి బ్లాక్ తర్వాత ఎక్కువగా నచ్చే రంగులు గ్రే,రెడ్. లేత రంగులు కూడా ఇష్టమే కానీ వాటికంటే డార్క్ షేడ్స్‌కి ఎప్పుడూ ఓటేస్తుంది.
