NTV Telugu Site icon

Shruti Haasan : హాలీవుడ్‌లోకి శృతి హాసన్.. రాణించేనా..?

The Eye

The Eye

సౌత్ ఇండియన్ బ్యూటీ శృతి హాసన్ హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. ‘ద ఐ’ చిత్రంలో నటిస్తోంది. రీసెంట్లీ ఫస్ట్ లుక్ రివీల్ చేసింది యూనిట్. హాలీవుడ్ దర్శకురాలు డాఫ్నీ ష్మోన్ తెరకెక్కిస్తోన్న ‘ది ఐ’లో శృతి హాసన్, మార్క్ రౌలీ, లిండా మార్లో కీ రోల్స్ చేస్తున్నారు. డయానా పాత్రలో నటించింది శృతి హాసన్. ఎప్పుడో కంప్లీటైన ఈ సినిమా అల్రెడీ గ్రీక్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, లండన్ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఫెస్టివల్ లో స్క్రీనింగై ప్రశంసలు దక్కించుకుంది.

Also Read : Venkatesh : సంక్రాంతికి వస్తున్నాం ఆల్ టైమ్ రికార్డ్

ఇప్పుడు ‘ద ఐ’ను త్వరలో ఇండియాలో కూడా రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రెజెంట్ కమల్ డాటర్ ప్రాజెక్టులు రెండు సెట్స్ పై ఉన్నాయి. రజనీకాంత్ కూలీతో పాటు విజయ్ సేతుపతి ట్రైన్ మూవీలో నటిస్తోంది. ఇదే కాకుండా సలార్ 2లో కూడా కంటిన్యూ కాబోతున్నదన్నది టాక్. సెట్స్ పైకి వెళ్లేంత వరకు ఈ ప్రాజెక్టుపై క్లారిటీ లేదు.డెకాయిట్, చెన్నై స్టోరీతో పాటు కన్నడ ప్రాజెక్ట్ నుండి శృతి హాసన్ క్విట్ కాగానే ఈమెతో సినిమా చేయడం కష్టమని, యాటిట్యూట్ ఎక్కువ చూపిస్తుందని అందుకే ఆమెను దర్శక నిర్మాతలు సినిమాల నుండి తప్పిస్తున్నారని వార్తలు గుప్పుమన్నాయి. కానీ మేడమ్ రూటే సెపరేట్ అవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతోంది. మల్టీ టాలెంట్ మెండుగా ఉన్నఈ అమ్మడు ఇండియాలో ఉండాలని అనుకోవడం లేదు ఇంటర్నేషనల్ స్థాయిలో ఫ్రూవ్ చేసుకోవాలనుకుంటుంది. మరీ హాలీవుడ్ లో రాణిస్తుందో లేదో చూడాలి.