NTV Telugu Site icon

#Nani30: నాని చిత్రంలో శ్రుతిహాసన్!

Sruthi

Sruthi

Shruti Haasan: ఈ యేడాది ప్రారంభంలోనే ‘వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య’ చిత్రాలతో డబుల్ ధమాకా విజయాలను అందుకుంది శ్రుతిహాసన్. అలానే ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన ‘సలార్’ మూవీలోనూ నాయికగా నటిస్తోంది. విశేషం ఏమంటే… నేచురల్ స్టార్ నాని ల్యాండ్‌మార్క్ 30వ చిత్రంలో శుత్రీహాసన్ సైతం భాగస్వామి కాబోతోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా గోవాలో జరుగుతోంది. దీని ద్వారా శౌర్యువ్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కోటి పరుచూరి దీనికి సీఓఓ కాగా, సతీశ్ ఈవీవీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.

తాజాగా శృతి హాసన్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. శ్రుతి హాసన్ ఈ రోజు గోవాలో షూటింగ్‌లో జాయిన్ అయింది. ఈ భారీ షెడ్యూల్‌లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రానికి సాను జాన్ వర్గీస్ ఐ.ఎస్.సి. సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తుండగా, ‘హృదయం’ ఫేమ్‌ కంపోజర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రవీణ్ ఆంథోని ఎడిటర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు.