నటసింహం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో మరో మాస్ ట్రీట్ రూపొందుతున్న విషయం తెలిసిందే. పక్కా మాస్ అండ్ కమర్షియల్ చిత్రంగా వీరిద్దరి కాంబోలో ‘ఎన్బీకే 107’ మూవీ రూపొందుతోంది. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తుంది. ఈరోజు శృతి హాసన్ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ఆమెను విష్ చేస్తూ ప్రత్యేక పోస్టర్ ను రిలీజ్ చేసింది.
Read Also : లంచం లేనిదే కంచం కూడా దొరకట్లేదు… ‘భళా తందనాన’ టీజర్
ఇక వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్రలో నటించనుంది. శాండల్‌వుడ్ స్టార్ దునియా విజయ్ ఈ సినిమాలో విలన్ గా చేస్తున్నారు. తన మొదటి టాలీవుడ్ సినిమాతోనే ఒక శక్తివంతమైన ప్రతినాయకుడిగా కనిపించబోతున్నారు. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించనున్నారు. థమన్ సౌండ్ ట్రాక్స్ అందించగా, రిషి పంజాబీ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించగా, నేషనల్ అవార్డ్ విన్నింగ్ క్రాఫ్ట్స్‌మెన్ నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు.
