Shruthi Hasan : లోకల్ ట్రైన్లలో కాలేజీకి వెళ్లా.. శృతి హాసన్ ఎమోషనల్..
- అంతకు ముందు బెంజ్ కార్లలో తిరిగా
- సడెన్ గా లైఫ్ ఛేంజ్
- స్టార్ హీరోయిన్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shruthi Hasan : హీరోయిన్ శృతిహాసన్ ఇప్పుడు బాలీవుడ్ కు షిఫ్ట్ అయిపోయింది. ప్రస్తుతం సినిమాల్లో పాన్ ఇండియా స్టార్ స్టేటస్ తెచ్చుకుంది. వరుస సినిమాలతో బిజీగా ఉంది ఈ భామ. అయితే తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఇందులో ఆమె మాట్లాడుతూ.. ‘నేను మా అమ్మ, నాన్న విడాకులతో చాలా బాధపడ్డాను. వాళ్ల విడాకులు నేను అస్సలు ఊహించలేదు. విడాకుల తర్వాత అమ్మతో పాటు నేను ముంబై వచ్చేశాను. అప్పుడు లోకల్ ట్రైన్లలో కాలేజీకి వెళ్లేదాన్ని. ఎక్కడకు వెళ్లాలన్నా లోకల్ ట్రైన్లలోనే వెళ్లాను. అప్పటి దాకా బెంజ్ కార్లలో తిరిగిన నేను వాళ్ల విడాకులతో ఒక్కసారిగా లైఫ్ మారిపోయినట్టు ఫీల్ అయ్యాను. ఇక సినిమాల్లోకి వచ్చిన తర్వాత నాన్నతోనే ఉంటున్నాను. నాన్న మమ్మల్ని బాగా చూసుకుంటారు.
Read Also : Anitha Chowdary: ‘సూరీడు’ తల్లి కొత్త బిజినెస్ పెట్టిందోచ్!
ఆయన వారసురాలిగానే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను. ఆయన సినిమాల్లో ఒక లెజెండ్. ఆయన పేరును నిలబెట్టాలన్నదే నా కల. ఆయనలాగా సినిమాలు చేయాలని ఎప్పటి నుంచో ఉంది. కానీ వీలు కావట్లేదు. ఆయన డిఫరెంట్ సినిమాలతో ఎదిగిన వ్యక్తి. నటనలో కూడా ఆయన్ను నేను మ్యాచ్ చేసుకోలేను. ఎందుకంటే ఆయన స్థాయి వేరు’ అంటూ చెప్పుకొచ్చింది శృతిహాసన్. చివరగా సలార్ సినిమాలో కనిపించింది ఈ బ్యూటీ. దాని తర్వాత మళ్లీ తెలుగులో చేయట్లేదు. ప్రస్తుతం బాలీవుడ్, తో పాటు కోలీవుడ్ లో రెండు సినిమాల్లో నటిస్తోంది. అలాగే టాలీవుడ్ లో సలార్-2తో మరోసారి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఒకప్పుడు టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా ఉన్న ఆమె.. ప్రస్తుతం సౌత్ సినిమాల్లో కంటే బాలీవుడ్ మీదనే ఫోకస్ పెట్టింది.
Also Read
తాజావార్తలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!