Site icon NTV Telugu

Shruthi Hasan : లోకల్ ట్రైన్లలో కాలేజీకి వెళ్లా.. శృతి హాసన్ ఎమోషనల్..

Shruthi Hasan

Shruthi Hasan

Shruthi Hasan : హీరోయిన్ శృతిహాసన్ ఇప్పుడు బాలీవుడ్ కు షిఫ్ట్ అయిపోయింది. ప్రస్తుతం సినిమాల్లో పాన్ ఇండియా స్టార్ స్టేటస్ తెచ్చుకుంది. వరుస సినిమాలతో బిజీగా ఉంది ఈ భామ. అయితే తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఇందులో ఆమె మాట్లాడుతూ.. ‘నేను మా అమ్మ, నాన్న విడాకులతో చాలా బాధపడ్డాను. వాళ్ల విడాకులు నేను అస్సలు ఊహించలేదు. విడాకుల తర్వాత అమ్మతో పాటు నేను ముంబై వచ్చేశాను. అప్పుడు లోకల్ ట్రైన్లలో కాలేజీకి వెళ్లేదాన్ని. ఎక్కడకు వెళ్లాలన్నా లోకల్ ట్రైన్లలోనే వెళ్లాను. అప్పటి దాకా బెంజ్ కార్లలో తిరిగిన నేను వాళ్ల విడాకులతో ఒక్కసారిగా లైఫ్‌ మారిపోయినట్టు ఫీల్ అయ్యాను. ఇక సినిమాల్లోకి వచ్చిన తర్వాత నాన్నతోనే ఉంటున్నాను. నాన్న మమ్మల్ని బాగా చూసుకుంటారు.
Read Also : Anitha Chowdary: ‘సూరీడు’ తల్లి కొత్త బిజినెస్ పెట్టిందోచ్!

ఆయన వారసురాలిగానే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను. ఆయన సినిమాల్లో ఒక లెజెండ్. ఆయన పేరును నిలబెట్టాలన్నదే నా కల. ఆయనలాగా సినిమాలు చేయాలని ఎప్పటి నుంచో ఉంది. కానీ వీలు కావట్లేదు. ఆయన డిఫరెంట్ సినిమాలతో ఎదిగిన వ్యక్తి. నటనలో కూడా ఆయన్ను నేను మ్యాచ్ చేసుకోలేను. ఎందుకంటే ఆయన స్థాయి వేరు’ అంటూ చెప్పుకొచ్చింది శృతిహాసన్. చివరగా సలార్ సినిమాలో కనిపించింది ఈ బ్యూటీ. దాని తర్వాత మళ్లీ తెలుగులో చేయట్లేదు. ప్రస్తుతం బాలీవుడ్, తో పాటు కోలీవుడ్ లో రెండు సినిమాల్లో నటిస్తోంది. అలాగే టాలీవుడ్ లో సలార్-2తో మరోసారి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఒకప్పుడు టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా ఉన్న ఆమె.. ప్రస్తుతం సౌత్ సినిమాల్లో కంటే బాలీవుడ్ మీదనే ఫోకస్ పెట్టింది.

Exit mobile version