Site icon NTV Telugu

Shriya Saran: బీచ్ ఒడ్డున బికినీ లో కూతురితో రచ్చ..

Shriya

Shriya

స్టార్ హీరోయిన్ శ్రీయా శరన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ సీనియర్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం కూతురు రాధ ద్వారా తల్లి ప్రేమను ఎంజాయ్ చేస్తోంది. కొన్నేళ్ల క్రితం విదేశీ వ్యాపారవేత్త ఆండ్రీ ని పెళ్లాడిన శ్రీయా సీక్రెట్ గా బిడ్డను కని అందరికి షాక్ ఇచ్చింది. ఇక కరోనా లాక్ డౌన్ లో ఆ విషయాన్నీ బయటపెట్టి, కూతురు పేరును రాధ అని పరిచయం చేసింది. ఆ తరువాత నుంచి అమ్మడు, కూతురితో కలిసి చేస్తున్న అల్లరిని మొత్తం సోషల్ మీడియా లో పంచుకుంటుంది. ఇక తాజాగా ఈ తల్లీకూతుళ్లు గోవా బీచ్ లో సందడి చేశారు.

పింక్ కలర్ బికినీ లో శ్రీయా హాట్ నెస్ చూసి కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. ఒక బిడ్డకు తల్లి అయినా కూడా శ్రీయ తన అందాన్ని కాపాడుకుంటున్న విధానాన్ని అభిమానులు మెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక రాధ సైతం చిన్న బికినీలో ఎంతో క్యూట్ గా కనిపించింది. ఇటీవలే శ్రీయ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో కనిపించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం పలు సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో నటిస్తూనే సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోషూట్లతో బిజీగా మారిపోయింది.

Exit mobile version