NTV Telugu Site icon

Shrikanth Iyengar: రెండోపెళ్లి కోసం శ్రీకాంత్ ఆరాటం.. ఆమెను ప్రేమిస్తున్నా అంటూ

Shrikanth

Shrikanth

Shrikanth Iyengar: ప్రస్తుతం టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్న నటుల్లో శ్రీకాంత్ అయ్యంగార్ ఒకరు. ఈ మధ్య కాలంలో మంచి మంచి సినిమాల్లో నటిస్తూ హిట్లు అందుకుంటున్నాడు. ఈ మధ్యనే సామజవరగమనా చిత్రంలో శ్రీ విష్ణుకు మామగా నటించి మెప్పించిన శ్రీకాంత్.. బెదురులంక 2012 చిత్రంలో దొంగస్వామిగా నటించి.. మంచి గుర్తింపునే సంపాదించుకున్నాడు. ఇక ఈ రెండు సినిమాలు హిట్ అందుకోవడంత శ్రీకాంత్ మరింత ఫేమస్ అయ్యాడు. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ.. తన సినిమాకు సంబంధించిన విషయాలను.. తాను ఎంజాయ్ చేసిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. ఇక తాజాగా.. శ్రీకాంత్.. ఒక ఫోటోను షేర్ చేసి.. వెంటనే డిలీట్ చేశాడు. లేడీ ఫోటోగ్రాఫర్ ఎలీ అనే యువతీతో దిగిన ఫోటోను షేర్ చేశాడు.

Samantha: సమంత.. రేణు దేశాయ్ లా మారుతుందా..?

ఇక దానికి క్యాప్షన్ గా .. ” మై లవ్.. ఆమె నన్ను పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నాను” అంటూ రాసుకొచ్చాడు. ఇక కొద్దిసేపటికే ఆ ఫోటోను డిలీట్ చేశాడు. పబ్ లో కలిసిన ఫోటోగ్రాఫర్ తో శ్రీకాంత్ పులిహోర కలుపుతున్నాడంటూ నెట్టింట వార్తలు హల్చల్ చేయడం మొదలుపెట్టాయి. ఇప్పటికే శ్రీకాంత్ కు పెళ్లి అయ్యి విడాకులు కూడా అయ్యాయి. ప్రస్తుతం సింగిల్ గా ఉంటున్న ఆయన రెండో పెళ్లి కోసం ఆరాటపడుతున్నాడని, అందుకే ఇలా పులిహోర కలుపుతున్నాడని చెప్పుకొస్తున్నారు. రెండో పెళ్లి చేసుకోవడంలో తప్పు లేదు.. కానీ , ఈ ఫోటోను ఆమెను అడిగే షేర్ చేశారా.. ? అలా చేస్తే డిలీట్ చేయడం ఎందుకు.. ? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇంకొంతమంది తాగిన మత్తులో చేసి ఉంటాడు అని చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.

Show comments