Saindhav: వెంకటేశ్ లాండ్ మార్క్ మూవీలో ‘జెర్సీ’ భామ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Venkatesh: విక్టరీ వెంకటేష్ 75వ లాండ్ మార్క్ మూవీ ‘సైంధవ్’ షూటింగ్ ప్రస్తుతం వైజాగ్‌లో జరుగుతోంది. టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకట్ బోయనపల్లి ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్ లో తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. చిన్న విరామం తర్వాత ప్రధాన తారాగణంతో రెండో షెడ్యూల్ వైజాగ్ లో మొదలైంది. ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటిస్తోంది. ఈ రోజు ఆమె పాత్రను మనోజ్ఞ గా పరిచయం చేశారు. పోస్టర్ లో ఏదో లోతుగా ఆలోచిస్తున్నట్లు చాలా సీరియస్ గా కనిపిస్తోంది. చేతిలో లంచ్ బాక్స్ తో కారులో కూర్చుని వుంది కానీ ఆమె దృష్టి మరెక్కడో వుంది. ఆమె పాత్ర గురించి శైలేష్ కొలను మాట్లాడుతూ, ”మనోజ్ఞ క్యారెక్టర్ ఇప్పటి వరకు శ్రద్ధకు వచ్చిన పాత్రల్లో బెస్ట్. ఇది పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్. ‘జెర్సీ’లో తన నటనకు ప్రశంసలు పొందిన శ్రద్ధా ‘సైంధవ్’లో మనోజ్ఞ గా ప్రేక్షకులను ఆశ్చర్యపరచనుంది. చాలా మంది అద్భుతమైన నటీనటులు కలిసి తెరపై కనిపిస్తూ ప్రేక్షకులకి గొప్ప అనుభూతి ని ఇవ్వనున్నారు. బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ ఈ చిత్రంతో టాలీవుడ్లోకి అడుగుపెడుతున్నారు. అలాగే పలువురు ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు” అని చెప్పారు.
‘సైంథవ్’ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఎస్. మణికందన్ కెమెరామెన్ గా, గ్యారీ బిహెచ్ ఎడిటర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి కిషోర్ తాళ్లూరు సహ నిర్మాత. ఇది పాన్ ఇండియా చిత్రంగా అన్ని దక్షిణాది భాషలు, హిందీలో డిసెంబర్ 22న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది.
Also Read
- Deepika Padukone: 'రాకా'.. హీరోయిన్ దీపికా పదుకొనే పనైపోయినట్టే, ఇక అవుట్!
- Varanasi Update: ‘వారణాసి’పై క్రేజీ అప్డేట్.. ఈసారి పకడ్బందీగా ప్లాన్ చేసిన రాజమౌళి!
- Lokesh Kanagaraj DC Movie Review : లోకేష్ కనగరాజ్ 'డీసీ' రివ్యూ..
- AAA Cinemas Vizag: ఈసారి పుష్పరాజ్‌ని కలవడం కష్టమే.. వైజాగ్ AAA ఓపెనింగ్‌కు ఫ్యాన్స్‌కు నో ఎంట్రీ!
తాజావార్తలు
-
Vu Glo Mini-LED TV: వీయూ గ్లో మినీ ఎల్ఈడీ టీవీ విడుదల.. 120Hz డిస్ప్లే, 50W సౌండ్‌తో కొత్త స్మార్ట్ టీవీ
-
Trent Boult విధ్వంసం.. యార్కర్‌తో బెయిర్‌స్టోకు షాక్.! ‘బై-బై’ సెలబ్రేషన్ వీడియో వైరల్.!
-
Telangana High Court: “సమాజంలో ఎవరికైనా బాధ్యత ఉందా”.. ఉచిత పథకాలపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
CM Chandrababu: వారికి ఎంతైనా ఖర్చు పెట్టాలనుంది.. కానీ ఖజానా ఖాళీగా ఉంది!
-
Petrol Cars India: పెట్రోల్ కార్ల శకం ముగిసిందా? ఈవీలు, హైబ్రిడ్ కార్ల అమ్మకాలు రికార్డు స్థాయికి.. మార్కెట్లో మారుతి ఆధిపత్యం
ట్రెండింగ్
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!