shraddha Kapoor: సాధారణంగా నటీనటుల మధ్య ఎంత లేదు అనుకున్నా కొద్దిగా జెలసీ ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్ల మధ్య జెలసీ ఎక్కువ ఉంటుందని .. చాలాసార్లు రుజువు అయ్యింది. ఇక ఈ మధ్యనే.. బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్- రష్మిక మధ్య ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరైన అనిల్ అంబానీ ఇంట వినాయక చవితి వేడుకలకు సినీ ప్రముఖులు హాజరయ్యారు. అందులో రష్మిక- శ్రద్దా కపూర్ కూడా ఉన్నారు. ఇక శ్రద్దా.. రష్మిక ను చూసి ముఖం తిప్పుకొని వెళ్లిన వీడియో నెట్టింట వైరల్ గా మారిన విషయం తెల్సిందే. రష్మిక.. కెమెరాలను కూడా పట్టించుకోకుండా.. శ్రద్దాను పలకరించడానికి ముందు వస్తే.. ఆమె మాత్రం కనీసం ఆమె వంక కూడా చూడకుండా వెళ్ళిపోయింది. దీనికి మొదట షాక్ అయిన రష్మిక.. కొద్దిసేపటి తరువాత తేరుకొని.. తన పని తాను చేసుకుంది. ఇక ఈ వీడియోపై నెటిజన్స్ ఘాటైన కామెంట్సే చేశారు.
Kiran Abbavaram: ఖైరతాబాద్ గణేష్ ఆశీస్సులు తీసుకున్న రూల్స్ రంజన్..
ఆమెకు జెలసీ అని, నేపో కిడ్స్ అయితేనే శ్రద్ధకు నచ్చుతారని, ఆటిట్యూడ్ చూపించిందని చెప్పుఉకోచ్చారు. ఇక తాజాగా.. శ్రద్దా.. ఆ మాటలను కవర్ చేయడానికి ప్రయత్నించింది. ఆమెకు ఎలాంటి జెలసీ లేదని, రష్మిక తో మంచి ఫ్రెండ్ షిప్ ఉన్నట్లు చెప్పడానికి చాలా ప్రయత్నాలు సాగించింది. ఈ మధ్యనే రశ్మికను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయ్యి .. యానిమల్ మూవీ పోస్టర్ కు కామెంట్ పెట్టింది. రష్మిక పోస్టర్ కు వాట్ ఏ బ్యూటీ అంటూ రాసుకొచ్చింది. దీంతో నువ్వెంత కవర్ చేసినా.. దొరికిపోయావ్ లే అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.