కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు టాలీవుడ్ లోను అభిమానులు ఉన్నారు. ఆయన నటించిన సినిమాలు తమిళ్, తెలుగులోను విడుదల అవుతాయి. ఇక ఇటీవల ఆకాశం నీ హద్దురా చిత్రం అమెజాన్ లో విడుదలై బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్న విషయం తెలిసిందే. కరోనా సమయంలో అన్ని చిత్రాలు ఓటిటీ బాట పట్టిన విషయం తెల్సిందే. అందులో సూర్య- జ్యోతిక నిర్మించిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే జ్యోతిక నటించిన రక్త సంబంధం అమెజాన్ లో విడుదలై మెప్పించింది. ఇక ఇటీవల సూర్య నటించిన ‘జై భీమ్’ చిత్రం కూడా నవంబర్ 2న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది. దీంతో కోలీవుడ్ లో సూర్యకు వ్యతిరేకంగా నినాదాలు మొదలయ్యాయి.
థియేటర్లు రిలీజ్ అయినా కూడా ఓటిటీ వైపు మొగ్గు చూపడంతో డిస్ట్రిబ్యూటర్లు పలువురు సూర్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇలాగే చేస్తే సూర్యను కోలీవుడ్ బ్యాన్ చేసేలా ఉందని కోలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే ‘జై భీమ్’ ఓటిటీ బాట పట్టడానికి కారణం లేకపోలేదు. ఆ చిత్రం కరోనా టైమ్ లోనే అమెజాన్ దక్కించుకొందని, ఇప్పుడు రిలీజ్ చేస్తుందని తెలుస్తోంది. ఓటీటీ లతో ఒప్పందాల్ని కష్టకాలంలో, ఏం చేయాలో పాలుపోని సమయంలోనే ఈ అగ్రిమెంట్ జరిగినట్లు సూర్య టీమ్ వాదిస్తోంది. ఏది ఏమైనా సూర్య చేసిన దానిలో తప్పేం లేదు అని సూర్య అభిమానులు నిక్కచ్చిగా చెప్తున్నారు.
