Baahubali The Epic : బాహుబలి 2 పార్ట్ లు కలిపి బాహుబలి ది ఎపిక్ సినిమాగా తీసుకు వస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 31న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించి అనేక విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిర్మాత శోభు యార్లగడ్డ తాజాగా ఎన్టీవీ పాడుకాస్ట్ లో ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయట పెట్టాడు. బాహుబలి సినిమా తీద్దాం అనుకున్నప్పుడు బడ్జెట్ గురించి చాలా రకాల చర్చలు జరిగాయన్నారు. అప్పటికి రాజమౌళి వరుస హిట్స్ తో ఉండటం, ప్రభాస్ కూడా వరుస హిట్స్ మీద జోష్ లో ఉండటం వల్ల బాహుబలి సినిమా గురించి చర్చలు జరిగాయున్నారు.
Read Also : Baahubali The Epic : బాహుబలి ది ఎపిక్.. తీసేసిన సీన్లు ఇవే.. ఫ్యాన్స్ కు షాక్
బాహుబలి కథ గురించి చర్చలు జరిగినప్పుడు అప్పటివరకు టాలీవుడ్ లో లేనంత భారీ బడ్జెట్ అవుతుందని.. పైగా ఒకే సినిమాగా తీసుకురావడం కష్టం అని రెండు పాటలుగా తేవాల్సిందే అని ఫిక్స్ అయ్యాం. అప్పుడు బడ్జెట్ భారీగా అవుతుందనే ఉద్దేశంతో రాజమౌళి వీలైతే నే చేద్దాం లేదంటే వేరే సినిమా చేసుకుందాం అన్నాడు. వేరే కథ కూడా రెడీగా ఉంది ప్రభాస్ కు బాగా సూట్ అవుతుంది కావాలంటే బాహుబలిని తర్వాత ఎప్పుడైనా చేద్దాం అన్నాడు. కానీ నేను ఒప్పుకోలేదు. బాహుబలి సినిమానే చేద్దాం అని మొదలుపెట్టాం. అలా ఈ సినిమాకు పునాదులు పడ్డాయి. మే ముందు అనుకున్న బడ్జెట్ కంటే చాలా ఎక్కువే అయింది. కానీ మా అంచనాలు ఎక్కడా తప్పలేదు. మొదటి పార్ట్ కంటే రెండు పార్ట్ మేము అనుకున్న టార్గెట్ ను రీచ్ అయ్యి లాభాలు తెచ్చిపెట్టింది అన్నారు శోభయార్లగడ్డ.
Read Also : Baahubali The Epic : కొత్త సీన్స్ యాడ్ చేయడంపై నిర్మాత క్లారిటీ
