గత కొన్నిరోజులుగా అక్కినేని నాగ చైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ్లతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు గుప్పుమన్న సంగతి తెల్సిందే. వారిద్దరూ కొన్ని రోజులుగా కలిసే ఉంటున్నారని, ఇద్దరూ డేటింగ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో పుకార్లు హల్చల్ చేయడం, వాటిపై చైతూ మాజీ భార్య, హీరోయిన్ సమంత రియాక్ట్ అవ్వడం.. పెద్ద దుమారాన్నే రేపాయి. ఇక ఈ వార్తలపై ఇప్పటివరకు అక్కినేని కుటుంబం కానీ, నాగ చైతన్య కానీ స్పందించకపోవడం విశేషం. ఇక ఎట్టకేలకు ఈ వార్తలపై శోభితా ధూళిపాళ్ల స్పందించింది.చైతో ప్రేమ వ్యవహారంపై మొట్టమొదటిసారి శోభితా ఒక ఇంటర్వ్యూలో నోరు విప్పింది.
చైతన్యతో తనకు ప్రేమ అంటూ వస్తున్న వార్తలు అన్ని పుకార్లే అని తేల్చేసింది. నిజం చెప్పాలంటేతమ ఇద్దరి మధ్య అంత క్లోజ్ పరిచయం కూడా లేదని, ఒకటి రెండు సార్లు హాయ్, బాయ్ చెప్పుకున్నామని తెలిపింది. ఇక ఈ వార్తలు అన్ని అబద్దమని కొట్టిపారేయడంతో అక్కినేని ఫ్యాన్స్ తో పాటు సామ్ ఫ్యాన్స్ కూడా ఊపిరి పీల్చుకున్నారు. మరి నిప్పు లేనిదే పొగ రాదు అంటారు.. అలాంటిది అన్ని పుకార్లు రావడానికి వీరిద్దరూ అంతగా ఎవరి కంట పడ్డారు అనేది మిస్టరీగా మారింది.
ఇక మరోపక్క బాలీవుడ్, టాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న శోభితా తనకు పరిచయమే లేని చైతూతో ఎలా డేటింగ్ చేస్తుంది..? ఇప్పటివరకు ఆమె నటించిన హీరోలందరిని వదిలేసి చైతూతో ఉండడానికి వారిద్దరూ కలిసి ఒక ప్రాజెక్ట్ చేయలేదు, ఒక ఈవెంట్ లో పాల్గొనలేదు.. మరి ఇలాంటి వార్తలు ఎలా వచ్చాయి అని అభిమానులు ఆరాలు తీస్తున్నారు. ఇక మరోపక్క ఏదిఏమైనా రూమర్స్ కు చెక్ పడినట్లే.. అది సంతోషం అని చెప్పుకొస్తున్నారు.