Site icon NTV Telugu

వైష్ణవ్ తేజ్, గిరీశయ్య సినిమాలో మరో హీరోయిన్ !

Shobhita Rana in Vaishnav Tej and Gireesaaya film

మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ 3వ చిత్రం దర్శకుడు గిరీశయ్యతో తెరకెక్కనుంది. కేతికా శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం మేకర్స్ శోభితా రానాను సినిమాలోని ముఖ్యమైన పాత్రకు తీసుకున్నారు. ఆమె “గిరీశయ్య” చిత్రంతో ఎంట్రీ ఇస్తోంది.

Read Also : గోవాలో ఫైట్ చేస్తున్న మహేశ్ బాబు!

రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా సెట్స్‌లో చేరిన నటి శోభితా రానా ఈ సినిమా అవకాశం గురించి హ్యాపీగా ఉన్నారు. మీడియా ఇంటరాక్షన్ సమయంలో శోభిత మాట్లాడుతూ “ఇంత పెద్ద సినిమాలో భాగమైనందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. తెలుగు చిత్ర పరిశ్రమలో భాగం కావడానికి ఇది గొప్ప సమయం అని నేను అనుకుంటున్నాను” అని అన్నారు. శోభితా రానా హిందీ, కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటి. ఇప్పుడు ఆమె తెలుగులో కూడా హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకోవడానికి సిద్ధమైంది.

Exit mobile version