NTV Telugu Site icon

Hanuman: భజరంగీతో హనుమాన్.. తేజ.. ఏం అదృష్టమయ్యా నీది..

Teja

Teja

Hanuman: తేజ సజ్జా, అమృత అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హనుమాన్. ఎన్నో ఆటంకాలను దాటుకొని జనవరి 12 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రీమియర్ల నుంచే ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అతి తక్కువ బడ్జెట్ తో ఒక అద్భుతాన్ని క్రియేట్ చేశాడు ప్రశాంత్ వర్మ. కేవలం నాలుగురోజుల్లోనే ఈ సినిమా రూ. 100 కోట్ల మార్క్ ను దాటేసింది. ఇక ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు ప్రశాంత్ వర్మను ప్రశంసించకుండా ఉండలేరు అని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఒక్కో విజువల్.. ఒక్కో డైమండ్ అని చెప్పొచ్చు. ఇక తేజ నటన మరో ఎత్తు. హనుమంతుడి శక్తులను అందుకున్న ఒక సాధారణ యువకుడు తన ఊరికి ఎలాంటి మంచి చేశాడు. ఆ యువకుడును అడ్డుకోవడానికి ప్రయత్నించిన దుష్టశక్తిని హనుమంతుడు ఎలా మట్టికరిపించాడు.. చివరికి హనుమంతుడు.. రాముడికి ఇచ్చిన మాట ఏంటి.. ? అనే కథతో ఈ సినిమాను తెరకెక్కించాడు ప్రశాంత్ వర్మ.

కేవలం తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లో ఈ సినిమాకు అభిమానులు బ్రహ్మరధం పడుతున్నారు. ప్రేక్షకులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు సైతం హనుమాన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈరోజు ఉదయమే ఈ సినిమాను బాలకృష్ణ వీక్షించి మెచ్చుకున్న విషయం తెల్సిందే. ఇక తాజాగా.. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ సైతం ఈ సినిమాను వీక్షించడం జరిగింది. హీరో తేజ సజ్జా.. శివరాజ్ కుమార్ కు ఒక స్పెషల్ స్క్రీనింగ్ లో హనుమాన్ సినిమాను చూపించాడు. ఇక హనుమాన్ సినిమా చూసాక.. తేజను హత్తుకొని శివన్న అభినందనలు తెలిపారు. సినిమా చాలా బావుందని మెచ్చుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక తేజ.. తన పాన్ ఇండియాయ్ సినిమానే పెద్ద హిట్ అందుకోవడం.. అతిచిన్న వయస్సులోనే.. స్టార్ హీరోల ప్రశంసలు అందుకోవడంతో తేజ.. ఏం అదృష్టమయ్యా నీది.. అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ఇక భజరంగీ అనే సినిమాలో శివన్న నటించిన విషయం తెల్సిందే.