NTV Telugu Site icon

Shiva Karthikeyan: శివ కార్తికేయన్, అనుదీప్ సినిమా మొదలైంది!

shiva karthikeyan

shiva karthikeyan

ప్రముఖ నటుడు శివ కార్తికేయన్ టాలీవుడ్ అరంగేట్రం కోసం ప్రతిభావంతులైన యువ దర్శకుడు అనుదీప్ కె.వి.తో కలిసి పని చేస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్‌లపై నారాయణ్ దాస్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ద్విభాషా చిత్రం (తెలుగు, తమిళ్) షూటింగ్ గురువారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, అరుణ్ విశ్వ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

తను దర్శకత్వం వహించిన ‘జాతి రత్నాలు’ బ్లాక్‌బస్టర్ సక్సెస్ సాధించిన తర్వాత అత్యంత డిమాండ్ ఉన్న దర్శకులలో ఒకడిగా మారిపోయాడు అనుదీప్. ‘వరుణ్ డాక్టర్’ చిత్ర విజయంతో తెలుగువారికీ మరింత చేరువయ్యాడు హీరో శివ కార్తికేయన్. ఆయనను దృష్టిలో పెట్టుకునే ఈ స్క్రిప్ట్ తయారు చేసినట్టు అనుదీప్ తెలిపాడు. శివకార్తికేయన్ కు ల్యాండ్‌మార్క్ గా వుండే ఈ 20వ చిత్రం గురువారం ప్రారంభం కావడంతో పాటు రెగ్యులర్ షూటింగ్ ను మొదలు పెట్టేసింది. సింగిల్ షెడ్యూల్ గా ఈ సినిమా కరైకుడి, పాండిచ్చేరిలో చిత్రీకరించబోతున్నారు. ప్రస్తుతం శివ కార్తికేయన్, సత్యరాజ్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ కథ యూకే లోని లండన్ నేపథ్యంలో జరుగుతుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.