Pathu Thala: శింబు కొత్త సినిమా ట్రైలర్ అదిరిపోయింది, నానికి కష్టాలు తప్పేలా లేవు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడ సూపర్ స్టార్ శివన్న నటించిన సూపర్ హిట్ సినిమా ‘మఫ్టీ’ని తమిళ్ లో రీమేక్ చేస్తున్నాడు యంగ్ హీరో శింబు. ఈ సూపర్ హిట్ సినిమాలో శివన్న ప్లే చేసిన రోల్ లో శింబు నటిస్తుండగా, శ్రీమురళి పాత్రలో గౌతమ్ కార్తీక్ కనిపించనున్నాడు. డైరెక్ట్ కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ రీమేక్ సినిమాకి ‘పత్తు తల’ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ‘పత్తు తల’ సినిమా మార్చ్ 30న ఆడియన్స్ ముందుకి రానుంది. ప్రమోషన్స్ ఇప్పటికే మొదలుపెట్టిన పత్తు తల చిత్ర యూనిట్, ఈ మాస్ యాక్షన్ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు.
మానాడు సినిమాతో సూపర్బ్ కంబ్యాక్ ఇచ్చిన హీరో శింబు, పత్తు తల సినిమా ట్రైలర్ తో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేశాడు. ట్రైలర్ కట్ చేసిన విధానం, ట్రైలర్ కి రెహమాన్ కొట్టిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్బ్ గా ఉంది. శింబు లుక్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ మెస్మరైజ్ చేసేలా ఉంది. ఈ సినిమాతో శింబు సాలిడ్ హిట్ కొట్టినట్లే అనే నమ్మకంలో ఫాన్స్ లో ఉన్నారు. యంగ్ హీరోయిన్ ప్రియా భవాని శంకర్ ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తున్న పత్తు తల సినిమాపై కోలీవుడ్ వర్గాల్లో భారి అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలని పత్తు తల ట్రైలర్ మరింత పెంచేసింది. ఇప్పుడు ఉన్న ఎక్స్పెక్టేషన్స్ కి ఏ మాత్రం పాజిటివ్ టాక్ తోడైనా నాని నటిస్తున్న దసరా సినిమాకి తమిళనాడులో కష్టాలు తప్పవు. మార్చ్ 30నే దసరా సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. అయితే శింబు సినిమా హిట్ టాక్ వస్తే నాని సినిమాకి ఆశించిన స్థాయిలో థియేటర్స్ దొరికే అవకాశం లేదు.
Also Read
తాజావార్తలు
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
-
Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
-
Archana: బిగిల్ నిర్మాతకు సీఎం విజయ్ కీలక పదవి
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!