Site icon NTV Telugu

శిల్పా, రాజ్ కుంద్రా పెళ్లి రోజు… ఒక్క పోస్ట్ తో అవన్నీ తప్పని నిరూపించిన హీరోయిన్

Raj-Kundra-and-Shilpa-Shett

Raj-Kundra-and-Shilpa-Shett

గత కొన్ని నెలలుగా శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా చాలా సమస్యలను ఎదుర్కొన్నారు. అశ్లీల చిత్రాల చిత్రీకరణ ఆరోపణల కేసులో రాజ్ అరెస్ట్ తర్వాత ఈ దంపతుల జీవితాలు మారిపోయాయి. ఈ క్రమంలో శిల్పా రాజ్‌ వ్యవహారంతో బాగా కలత చెందిందని, వారిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలన్నీ తప్పని నిరూపిస్తూ శిల్పా తమ పెళ్లి రోజు సందర్భంగా రాజ్ కోసం ప్రత్యేక పోస్ట్ చేసింది.

Read Also : ఇంకోసారి టీఎస్ ఆర్టీసీ గురించి తక్కువ చేస్తే… సజ్జనార్ ట్వీట్

ఈ రోజు శిల్పా, రాజ్‌ల వివాహ వార్షికోత్సవం. ఈ సంద‌ర్భంగా శిల్పా రాజ్ రాజ్‌తో తన వివాహానికి సంబంధించిన కొన్ని ఫోటోలను పంచుకుంటూ “ఈ క్షణం నుంచి 12 సంవత్సరాల క్రితం. మేము మంచి, చెడు సమయాల్లో కలిసే ఉంటామని ఒకరికొకరు వాగ్దానం చేశాము. ఈరోజు కూడా ఈ హామీని నెరవేరుస్తున్నాం. మేము ప్రేమను నమ్ముతాము. దేవుడు ఎప్పుడూ మనకు సరైన మార్గాన్ని చూపిస్తాడు. హ్యాపీ యానివర్సరీ కుక్కీ… ఇక్కడ మరిన్ని రెయిన్‌బోలు, సంతోషం, మైలురాళ్ళు, మా అత్యంత విలువైన వస్తువు… మా పిల్లలకు’ అంటూ పెళ్ళినాటి ఫోటోను షేర్ చేసింది శిల్పా. ఈ ఫోటోలలో శిల్పా ఎరుపు రంగు పెళ్లి చీర, భారీ ఆభరణాలను ధరించగా, మరోవైపు రాజ్ శిల్పా దుస్తులతో సరిపోయే షేర్వాణీ, సెహ్రాను ధరించాడు.

జైలు నుండి బయటకు వచ్చినప్పటి నుండి రాజ్ లైమ్‌లైట్‌కు దూరంగా ఉన్నాడు. గతంలోలా శిల్పాతో కలిసి ఔటింగ్స్‌లో కనిపించడం లేదు. దీంతో పాటు తన సోషల్ మీడియా ఖాతాలన్నింటినీ తొలగించాడు. కొద్ది రోజులుగా రాజ్ వ్యక్తిగత జీవితాన్ని ప్రైవేట్ గా గడుపుతున్నాడు.

View this post on Instagram

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty)

Exit mobile version