ఇంకోసారి టీఎస్ ఆర్టీసీ గురించి తక్కువ చేస్తే… సజ్జనార్ ట్వీట్

టీఎస్ ఆర్టీసీని తక్కువ చేస్తూ ఇటీవల రాపిడో అనే సంస్థ చేసిన యాడ్ విషయమై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్, రాపిడో సంస్థ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ డిమాండ్ చేశారు. అంతకుడు సెలెబ్రిటీలు కమర్షియల్ యాడ్ లు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, డబ్బుల కోసం ప్రభుత్వ రంగ సంస్థల ప్రతిష్టను దిగజార్చే విధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని, ఈ విషయంపై న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. తాజాగా మరోమారు మన టీఎస్ ఆర్టీసీ బస్సు స్పెషల్ ఏంటో తెలుసా ? అంటూ ఓ స్పెషల్ మీమ్ ను షేర్ చేశారు. అందులో ధనుష్, అమలాపాల్ మధ్య సంభాషణ జరుగుతున్నట్టుగా కన్పిస్తోంది. ‘రఘువరన్ బిటెక్’ సినిమాలో నిరుద్యోగం గురించి ధనుష్ గుక్క తిప్పుకోకుండా చెప్పే డైలాగును పోలి ఉండడం ఆసక్తికరంగా ఉంది.

Read Also : హనీ ట్రాప్ లో బాలీవుడ్ నటుడి భార్య అరెస్ట్… కోట్ల నగదు స్వాధీనం

ఆ మీమ్ లో “ఏముందిరా మీ ఆర్టీసీలో స్పెషల్ ?” అని అమల పాల్ ప్రశ్నిస్తున్నట్టుగా కన్పించగా, “నా ఆర్టీసీ బస్ లో స్పెషల్ ఏముందా? 100 రూపాయల టి-24 టికెట్ కొనుక్కుని హైదరాబాద్ మొత్తం తిరుగుతాము. నువ్వు 100 రూపాయల పెట్రోల్ కొట్టుకుని నీ ఆడి కార్ లో హైదరాబాద్ మొత్తం తిరగగలవా ? 200 రూపాయలు పెట్టి స్టూడెంట్ పాస్ తీసి నెల మొత్తం తిరుగుతా. అదే నువ్వు 200 పెట్రోల్ కొట్టించుకుని నీ ఆడి కార్ లో నెల రోజులు కాదు కనీసం ఒక్కరోజైనా తిరగగలవా ? 50 మంది ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేసుకుంటూ జర్నీ చేస్తా. నీ కార్ లో కనీసం 10 మందిని అయినా ఎక్కించుకోగలవా ? కారును బుక్ చేసుకోవాలంటే ముందే సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి. అదే బస్సుకు అయితే అదేం అక్కర్లేదు. ఇంకోసారి టిఎస్ ఆర్టీసీ గురించి తక్కువ చేసి మాట్లాడితే మర్యాదగా ఉండదు చెప్తున్నా” అని ధనుష్ సమాధానం ఇచ్చినట్టుగా ఉంది. అయితే ఇదంతా చూస్తుంటే సజ్జనార్ ఎవరికో ఇన్ డైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తున్నట్టుగా కన్పిస్తోందని అంటున్నారు నెటిజన్లు.

Related Articles

Latest Articles