Site icon NTV Telugu

Shilpa Shetty – Raj Kundra: శిల్పా శెట్టి దంపతులపై రూ.60 కోట్ల మోసం కేసు.. కొత్త మలుపు!

Shilpa Shetty And Raj Kundra

Shilpa Shetty And Raj Kundra

బాలీవుడ్‌ నటి శిల్పా శెట్టి, భర్త రాజ్‌ కుంద్రా మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. వ్యాపారవేత్త దీపక్‌ కొఠారి చేసిన ఫిర్యాదు మేరకు రూ.60 కోట్ల మోసం కేసులో శిల్పా దంపతులపై జుహు పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో దర్యాప్తు వేగం పెరిగింది. సమాచారం ప్రకారం, నిధుల మళ్లింపు లో కీలక పాత్ర పోషించిన నలుగురు ఉద్యోగులను దర్యాప్తు అధికారులు గుర్తించినట్లు తెలిసింది. వీరు శిల్పా-రాజ్‌ కంపెనీలో ఉన్నత స్థానాల్లో పనిచేసేవారని, వారిలో ఒకరు ఇప్పటికే విచారణకు హాజరయ్యారని ఆర్థిక నేరాల విభాగం (EOW) వెల్లడించింది. ఈ నలుగురినీ సమన్లు జారీ చేసి ప్రశ్నించనున్నట్లు అధికారులు తెలిపారు.

Also Read : KGF Chacha: కేజీఎఫ్‌ నటుడు మృతి..

అదే సమయంలో రాజ్‌ కుంద్రా కంపెనీ లావాదేవీల పేరుతో డబ్బును వేరే దారికి మళ్లించారా లేదా అన్న అంశంపై అధికారులు విచారణ చేస్తున్నారు. ఇక మరోవైపు, కేసు విచారణ జరుగుతున్నప్పటికీ శిల్పా, రాజ్‌ కుంద్రా తరచూ విదేశీ పర్యటనలకు వెళ్లడం అధికారులు గమనించినట్లు తెలుస్తోంది. అందుకే జాగ్రత్త చర్యగా లుకౌట్‌ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. గతంలో కూడా రాజ్‌ కుంద్రా పేరుతో అనేక వ్యాపార వివాదాలు, క్రిప్టో , యాప్‌ మోసాల కేసులు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ రూ.60 కోట్ల కేసు కొత్త మలుపు తిరుగుతుండటంతో బాలీవుడ్‌ సర్కిల్‌లో మరోసారి చర్చ మొదలైంది.

Exit mobile version