Site icon NTV Telugu

శిల్పా చౌదరి ఉచ్చులో టాలీవుడ్ యంగ్ హీరో.. ఏకంగా రూ.3 కోట్లు

sehari hero harsh

sehari hero harsh

శిల్పా చౌదరి కేసు రోజురోజుకు సంచలనంగా మారుతోంది. అధిక వడ్డీ పేరుచెప్పి టాలీవుడ్ ప్రముఖుల వద్ద నుంచి కోట్లు కొల్లగొట్టిన ఈమెను ఇటీవల్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ కేసులో ఆమెకు కోర్టు బెయిల్ కూడా నిరాకరించింది. మరోపక్క శిల్పా బాధితులు ఒక్కొక్కరిగా బయటికి వస్తున్నారు. రెండు రోజుల క్రితం శిల్పా చౌదరి తన వద్ద రూ. 2.9 కోట్లు తీసుకొని మోసం చేసిందని మహేష్ బాబు సోదరి, హీరో సుధీర్ బాబు భార్య ప్రియదర్శిని పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

ఇక తాజాగా మరో యంగ్ హీరో తాను కూడా మోసపోయినట్లు పోలీసులను ఆశ్రయించడం సంచలనంగా మారింది. ‘సెహరి’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమవుతున్న హర్ష్ కనుమల్లి సైతం శిల్పా ఉచ్చులో పడ్డాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం అని చెప్పి తన వద్ద నుంచి రూ. 3 కోట్లు శిల్పా దోచేసింది తెలుపుతూ పోలిస్లకు ఫిర్యాదు చేశాడు. తాను కూడా శిల్పా కిట్టి పార్టీలకు హాజరు అయ్యేవాడినని, రియల్ ఎస్టేట్ వ్యాపారం అని తనకు మాయమాటలు చెప్పి తన వద్ద నుంచి రూ. 3 కోట్లు తీసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇక హర్ష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు శిల్పాను మరోసారి విచారించనున్నారు. ఇప్పటికే శిల్పా చౌదరి 50 కోట్ల రూపాయలను హవాలా పేరుతో దుబాయ్ కి పంపిందని సమాచారం. అంతేకాకుండా ఆమెకున్న 6 అకౌంట్లను పోలీసులు సీజ్ చేసి ఆరా తీస్తున్నారు. మరి శిల్పా బాధితుల ఖాతాలో ఇంకేతంది స్టార్ హీరోలు ఉన్నారో తెలియాలి.

Exit mobile version