Site icon NTV Telugu

Shreya Ghoshal: స్టార్ సింగర్ శ్రేయ ఘోషల్ భర్త మీకు బాగా తెలిసిన కంపెనీ హెడ్ తెలుసా?

Shiladitya Mukhopadhyaya

Shiladitya Mukhopadhyaya

Shiladitya Mukhopadhyaya, Shreya Ghoshal’s husband who leads a Rs 1406 crore company: ప్రఖ్యాత గాయని శ్రేయ ఘోషల్ తన మంత్రముగ్ధులను చేసే స్వరంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించింది. తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ, మరాఠీ, అస్సామీ, పంజాబీ, ఒరియా భాషల్లో పాటలు పాడిన రియల్ పాన్ ఇండియా సింగర్ ఆమె. ఒక్క తెలుగులోనే 200కు పైగా పాటలు పాడారు. తన పాటలకు జాతీయ అవార్డులతో పాటు ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు. ఇక శ్రేయా ఘోషల్ తన చిన్ననాటి స్నేహితుడు శిలాదిత్య ముఖోపాధ్యాయను వివాహం చేసుకుంది. 2021లో ఈ దంపతులకు దేవయాన్ అనే కుమారుడు కూడా జన్మించాడు. భారతీయ సినిమా నేపథ్య సంగీతానికి శ్రేయా ఘోషల్ రాణి అయితే, ఆమె భర్త శిలాదిత్య ముఖోపాధ్యాయ వ్యాపార ప్రపంచంలో బాగా ఫెమిలియర్ వ్యక్తి.

Darshan Wife: ఆ వార్తలు ప్రసారం చేయొద్దు.. కోర్టులో ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్న దర్శన్ భార్య!

శిలాదిత్య ఏప్రిల్ 2022 నుండి ట్రూకాలర్ యొక్క గ్లోబల్ హెడ్‌గా ఉన్నారు. ట్రూకాలర్ వార్షిక నివేదిక ప్రకారం, జనవరి నుండి డిసెంబర్ 2023 వరకు దాదాపు రూ. 1406 కోట్లు) ఆదాయాన్ని ఆర్జించింది. శిలాదిత్య ముఖోపాధ్యాయ తన లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ ప్రకారం వ్యాపార అభివృద్ధి, మొబైల్ అప్లికేషన్‌లు, సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, ప్రోడక్ట్ మేనేజ్‌మెంట్, ఆటోమేషన్ సిస్టమ్‌ల ఇంటిగ్రేషన్‌లో ఆయన స్పెషలిస్ట్. అంతకు ముందు ఆయన కాలిఫోర్నియాలోని SaaS కంపెనీ అయిన CleverTapలో సేల్స్ డైరెక్టర్‌గా తరువాత సేల్స్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశాడు. శ్రేయా ఘోషల్ మరియు శిలాదిత్య 10 సంవత్సరాలు డేటింగ్ చేసి పెళ్లి చేసుకున్నారు. స్నేహితుడి పెళ్లి సందర్భంగా శిలాదిత్య తనకు ప్రపోజ్ చేశాడని శ్రేయా ఘోషల్ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. ఇటీవల ఆమె తన భర్తను తన సోల్ ఫ్రెండ్ అని కూడా సంభోదించింది. 5 సార్లు జాతీయ చలనచిత్ర అవార్డు అందుకున్న శ్రేయా ఘోషల్ భారతదేశంలో అత్యధిక పారితోషికం పొందే సింగర్స్ లో ఒకరు. కేవలం ఆమె ఒక్కరి ఆస్తి విలువ 180-185 కోట్ల రూపాయలుగా ఉండోచ్చు.

Exit mobile version