యాంగ్రీ స్టార్ రాజశేఖర్ ప్రధాన పాత్రలో జీవితా రాజశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘శేఖర్’. పెగాససన్ సినీ కార్ప్ తౌరుర్ సినీ కార్ప్ సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్ త్రిపుర క్రియేషన్స్ బ్యానర్ లపై భీరం సుధాకర్ రెడ్డి శివానీ రాజశేఖర్ శివాత్మిక రాజశేఖర్ వెంకట శ్రీనివాస్ బొగ్గరం ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మలయాళ సూపర్ హిట్ ‘జోసెఫ్’ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాజశేఖర్ పెద్ద కూతురు శివాని రాజశేఖర్ కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న విషయం విదితమే. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
‘పోలీస్ యూనిఫామ్ వేసుకుని కూడా డ్యూటీ చేయని వాళ్లు చాలా మంది వుంటారు. అదే పోలీస్ ఉద్యోగానికి రిజైన్ చేసి కూడా డ్యూటీ కోసం ప్రాణమిచ్చే వాళ్లు వేలల్లో ఒక్కరే వుంటారు.. అంటూ రాజశేఖర్ క్యారెక్టర్ కు ఎలివేషన్ ఇస్తూ ట్రైలర్ మొదలయ్యింది. రిజైన్ చేసిన పోలీసాఫీసర్ శేఖర్ ఒక కేసును పర్సనల్ గా ఇన్వెస్టిగేషన్ చేయడం, ఆ ఇన్వెస్టిగేషన్ లో శేఖర్ కు ఎదురైనా ఇబ్బందులు, అస్సలు ఆ కేసు ఎవరికి సంబంధించింది. ఎందుకు శేఖర్ ఈ కేసును అంత పర్సనల్ తీసుకోవాల్సివచ్చింది అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇక చాలా రోజుల తరువాత రాజేశేఖర్ తన వయస్సుకు తగ్గ క్యారెక్టర్ లో నటించాడు. ఈ చిత్రంలో రాజశేఖర్, శివానీ రియల్ లైఫ్ తరహాలోనే తండ్రీ కూతుళ్లుగా నటించారు. రాజశేఖర్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో తనదైన స్వాగ్ లో పాత యాంగ్రీ మెన్ ని గుర్తుచేశాడు. చివర్లో ప్రకాష్ రాజ్ లాయర్ గా అల్టిమేట్ లుక్ లో దర్శనమిచ్చి మెప్పించాడు. మొత్తానికి ట్రైలర్ తో ఈ సినిమా పై భారీ అంచనాలను రేకెత్తించారు మేకర్స్. ఇకపోతే ఈ సినిమా మే 20 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి ఈ చిత్రంతో రాజశేఖర్ హాట్ ను అందుకుంటాడా లేదా చూడాలి.
