NTV Telugu Site icon

Allu Arjun: బన్నీను అచ్చు గుద్దినట్లు దింపేసిన బాలీవుడ్ కుర్ర హీరో

Allu Arjun

Allu Arjun

Allu Arjun: అల్లు అర్జున్ ఐకానిక్ స్టైల్ గురించి ప్రత్యేకంగా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మరి ముఖ్యంగా అల వైకుంఠపురంలో అయితే బన్నీ స్టైల్ కు ఫిదా కానివారుండరు. ఇక తాజాగా బన్నీ స్టైల్ ను అచ్చు గుద్దినట్లు దింపేశాడు బాలీవుడ్ కుర్ర హీరో కార్తీక్ ఆర్యన్. ఈ కుర్ర హీరో అల వైకుంఠపురంలో సినిమాను హిందీలో షెహజాదా అనే పేరుతో రీమేక్ చేస్తున్న విషయం విదితమే. డేవిడ్ ధావన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇక నేడు కార్తీక్ ఆర్యన్ పుట్టినరోజును పురస్కరించుకొని ఫస్ట్ లుక్ టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ లో కార్తీక్, బన్నీని కాపీ, పేస్ట్ చేశాడు. సినిమాను మక్కీకి మక్కి దింపేశారు. అదే ఇల్లు, అదే బన్నీ లుక్.. ఆ లుక్ లో కార్తీక్ కూడా అదిరిపోయాడు. ముఖ్యంగా చిత్తరాల సిరపడు సాంగ్ లో తలకు తలపాగా కట్టుకొని రెడ్ షర్ట్ లో బన్నీ లుక్ ఇప్పటికి కళ్ళముందే మెదులుతూ ఉంటుంది. ఇక అదే తరహాలో కార్తీక్ కూడా ట్రై చేశాడు. ఇక ఈ చిత్రంలో కార్తీక్ సరసన కృతి సనన్ నటిస్తుండగా సీనియర్ నటి మనీషా కొయిరాల, పరేష్ రావల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మరి ఈ సినిమా బాలీవుడ్ లో ఎలాంటి ముఅజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి.