Site icon NTV Telugu

Shehnaaz Kaur Gill: ప్రేమ పేరుతో నన్ను మోసం చేశారు.. బాలీవుడ్ బ్యూటీ ఆవేదన

Shehnaaz Gill

Shehnaaz Gill

Shehnaaz Kaur Gill Shares Her Bad Experiences In Love: సాధారణంగా సెలెబ్రిటీలు తమ వ్యక్తిగత విషయాలు, ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల గురించి మాట్లాడటానికి పెద్దగా ఇష్టపడరు. వాటిని సీక్రెట్‌గానే ఉంచుతారు. కానీ.. కొందరు మాత్రం నిర్మొహమాటంగా బయటకు చెప్పేస్తుంటారు. ఇప్పుడు లేటెస్ట్‌గా బాలీవుడ్ బ్యూటీ షెహనాజ్ గిల్ కూడా తమ ప్రేమ, బ్రేకప్స్ గురించి చెప్పుకొచ్చింది. ప్రేమలో ఉన్నప్పుడు తానెవ్వరినీ మోసం చేయలేదని, కానీ తననే చాలామంది మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రేమ పేరుతో తనను కొందరు నట్టేట ముంచారని కుండబద్దలు కొట్టింది.

Anil Kumar Yadav: దమ్ముంటే నా సవాల్ స్వీకరించాలి.. ఎమ్మెల్యే అనిల్ ధ్వజం

పంజాబీ నటి అయిన షెహనాజ్.. తాజాగా నవాజుద్దీన్ సిద్ధిఖీతో కలిసి ‘యార్ కా సతాయా హువా హై’ అనే ఓ ప్రైవేట్ సాంగ్‌లో నటించింది. ఇందులో ప్రియురాలు తన ప్రియుడ్ని వదిలేసి, మరొకరిని పెళ్లి చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో.. మీరు ఎవరైనా ప్రేమలో మోసం చేశారా? అనే ప్రశ్న షెహనాజ్‌కు ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘నేను ఫలానా వ్యక్తితో ప్రేమలో ఉన్నప్పుడు, ఆ వ్యక్తికి ఎప్పుడూ మోసం చేయలేదు. కానీ, ప్రతీసారి నేనే మోసపోయాను’’ అంటూ తెలిపింది. ఒకవేళ పార్ట్నర్ మరొకరితో సన్నిహితంగా ఉన్నాడని తెలిస్తే, అప్పుడు వెనకడుగు వేయడమే మంచిదని హితవు పలికింది. ఈరోజుల్లో తాను నమ్మేది ఒకటే సిద్ధాంతమని, బ్రేకప్ చెప్పి దూరంగా వెళ్లిపోవాలనుకుంటే వెళ్లిపోండని తేల్చి చెప్పింది. అయితే.. తనకు నిజమైతే ప్రేమ దొరికితే మాత్రం, అస్సలు విడిచిపెట్టనని స్పష్టం చేసింది.

Hookah Centre: కేఫ్ ముసుగులో హుక్కా సెంటర్.. కాప్స్‌ అదుపులో ముగ్గురు

కాగా.. పంజాబీ నటి అయిన షెహనాజ్ గిల్, సొంత భాషలో పలు సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది. బిగ్ బాస్ పుణ్యమా అని, ఈమెకి పాపులారిటీ వచ్చిపడింది. ఆ షోలో బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ శుక్లాతో రిలేషన్‌లో ఉంది. కానీ సిద్ధార్థ్ అకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోవడంతో, ఆమె డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. కొన్నాళ్లకు కుదుటపడి.. సినిమాలు, ఆల్బమ్ సాంగ్స్ చేస్తూ బిజీగా మారింది. ఈ అమ్మడు సల్మాన్ ఖాన్ నటించిన ‘కిసీ కా భాయి కిసీ కా జాన్’ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది.

Exit mobile version