Site icon NTV Telugu

Sharwanand: బ్రేకింగ్.. శర్వానంద్ కు సర్జరీ.. ?

Sharwa

Sharwa

Sharwanand: యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం ఒక భారీ హిట్ కోసం కష్టపడుతున్న విషయం తెల్సిందే. గత కొన్నేళ్లుగా శర్వాకు మంచి హిట్టు అన్నదే లేదు. ఇక ఈ మధ్యనే బేబీ ఆన్ బోర్డ్ అనే సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే ఇక ఈ సినిమాతో పాటు చిరంజీవితో ఒక సినిమా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ ఏడాదే శర్వానంద్ ఒక ఇంటివాడయ్యాడు. పెళ్లి తర్వాత కథలను ఎంచుకునే విధానంలో శర్వా చాలా మార్పులు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం శర్వాకు సంబంధించిన ఒక న్యూస్ గా నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే ఒక సర్జరీ కోసం ఈ కుర్ర హీరో అమెరికా వెళ్ళినట్లు సమాచారం అందుతుంది. జాను సినిమా సమయంలో శర్వాకు ప్రమాదం జరిగిన విషయం తెల్సిందే. ఈ ప్రమాదం వలన ఆయన బరువు పెరిగాడు.

69 National Awards: నేషనల్ అవార్డ్స్ గెలిచిన మన తెలుగువారు వీరే..

ఇక ఈ ప్రమాదంలో దెబ్బలు కూడా గట్టిగా తగిలాయని శర్వా చెప్పుకొచ్చాడు. ఇక అప్పుడు సంబంధించిన గాయాలు మానినా.. కొన్ని నొప్పులు అలాగే ఉన్నాయని సమాచారం. అందుకే దానికోసం అమెరికాలో ఒక సర్జరీ చేయించుకోవడానికి శర్వా వెళ్ళినట్లు తెలుస్తుంది. ఆయన తిరిగి రాగానే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్ లో పాల్గొననున్నాడని సమాచారం. ఈ విషయం తెలియడంతో అభిమానులు శర్వా సర్జరీ సక్సెస్ అవ్వాలని, ఆయన త్వరగా కోలుకొని సెట్లో అడుగు పెట్టాలని కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమాలతో ఈ కుర్ర హీరో ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి.

Exit mobile version