Sharwanand : ‘జార్జ్ కృష్ణ’ కోసం మిస్ ఇండియా.. వైట్ల హిట్ ఇస్తాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ తన తదుపరి చిత్రాన్ని కామెడీ సినిమాల స్పెషలిస్ట్ శ్రీను వైట్లతో చేయబోతున్నారు. ‘జార్జ్ కృష్ణ’ అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రం పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా ఉండబోతోంది. శ్రీను వైట్ల మార్క్ వింటేజ్ కామెడీ స్టైల్లో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు సమాచారం.
ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్నది గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. మొదట పూజా హెగ్డే, ఆ తర్వాత ‘ప్రేమలు’ ఫేమ్ మమితా బైజు పేర్లు వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం.. మిస్ ఇండియా మానస వారణాసి ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చి చేరినట్లు తెలుస్తోంది. మేకర్స్ ఆమెను హీరోయిన్గా ఫైనలైజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు జూలైలో జరగనున్నాయి. ఆగస్టు నెల నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ టార్గెట్‌గా పెట్టుకున్నారు. శర్వానంద్ టైమింగ్‌కు, శ్రీను వైట్ల మార్క్ కామెడీ తోడైతే బాక్సాఫీస్ వద్ద నవ్వుల జాతర ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ ఏడాది నారి నారి నడుమ మురారితో సూపర్ హిట్ కొట్టిన శర్వా బైకర్ తో కొంత మేర నిరాశ పరిచాడు. శ్రీనువైట్ల సినిమాతో వచ్చే ఏడాది సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని పట్టుదలగా ఉన్నాడు శర్వా. అటు వైట్ల కెరీర్ కు హిట్ కంపల్సరీ. వీరిద్దరు ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Sharwanand : ‘జార్జ్ కృష్ణ’ కోసం మిస్ ఇండియా.. వైట్ల హిట్ ఇస్తాడా?
-
Hyderabad: పక్కా ప్లాన్‌తో దోపిడీలు.. హైదరాబాద్ పోలీసులకు తలనొప్పిగా మారిన నేపాలీ గ్యాంగ్‌లు..
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
PBKS Captain Shreyas Iyer: చాలా బాధగా ఉంది.. మా విజయాన్ని ఆ ‘ఒక్కడు’ లాగేసుకున్నాడు!
-
Google Free Storage: గూగుల్ షాకింగ్ డెసిషన్.. ఫ్రీ స్టోరేజ్‌లో భారీ మార్పు.. కొత్త అకౌంట్లకు 5GB మాత్రమే!
ట్రెండింగ్
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!