Site icon NTV Telugu

Aadavallu Meeku Johaarlu Pre Release Event : శర్వానంద్ ప్రామిస్… నిలబెట్టుకుంటాడా ?

శర్వానంద్, రష్మిక జంటగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన చిత్రం “ఆడవాళ్లు మీకు జోహార్లు”. నిన్న హైదరాబాద్‌లో చిత్రబృందం గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా సుకుమార్, కీర్తి సురేష్, సాయి పల్లవి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో శర్వానంద్ మాట్లాడుతూ అతిథులపై ప్రశంసలు కురిపించారు. ఈ ఈవెంట్‌కి వచ్చినందుకు సుకుమార్, కీర్తికి ధన్యవాదాలు తెలిపాడు మరియు సాయి పల్లవిని డార్లింగ్ అని ప్రత్యేకంగా ప్రస్తావించాడు. “నేను కూడా ఆమె నుండి హృదయపూర్వకంగా మాట్లాడటం నేర్చుకుంటాను. ఈరోజు ఆమెకు పెద్ద ఎత్తున అభిమానులు రావడానికి అదే కారణం. ఈరోజు హెల్త్ బాగాలేకపోయినా ఇక్కడికి వచ్చింది. అందుకు ఆమెకు కృతజ్ఞతలు’’ అని శర్వానంద్ అన్నారు.

Read Also : Ravi Teja : మేనేజర్ ఇంట వేడుక… మాస్ మహారాజా సందడి

శర్వానంద్ తన సహ నటులకు కృతజ్ఞతలు తెలుపుతూ “నేను సినిమాలో చాలా మంది ప్రతిభావంతులైన మహిళా కళాకారులతో పని చేశాను. ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు” అని అన్నారు. “ఆడవాళ్లు మీకు జోహార్లు నా కెరీర్‌లోనే బెస్ట్ ఫిల్మ్ అవుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. మార్చి 4న మీ అందరినీ థియేటర్లలో కలుస్తున్నాం. నా బలం ఫ్యామిలీ ఎంటర్టైనర్… ఈ మధ్యకాలంలో నేను వాటిని మిస్ అవుతున్నాను. ఇది మీ అందరికీ తెలుసు. ఈ సినిమాతో నా బలంతో మళ్లీ వచ్చాను. సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అని శర్వానంద్‌ ఎంతో నమ్మకంతో చెప్పారు. ఒక మంచి సినిమా చూశామన్న తృప్తితో థియేటర్ల నుంచి బయటకు వస్తారని మీ అందరికీ వాగ్దానం చేస్తున్నాను అని శర్వానంద్ తన ప్రసంగాన్ని ముగించారు.

https://www.youtube.com/watch?v=SIuRVke98iQ
Exit mobile version