NTV Telugu Site icon

Sharwanand: బ్రేకింగ్.. తండ్రి అయిన శర్వానంద్.. కూతురు పేరు వింటే..?

Rakshitha

Rakshitha

Sharwanand: కుర్ర హీరో శర్వానంద్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక గత ఏడాది శర్వా పెళ్లి పీటలు ఎక్కిన విషయం తెల్సిందే. జూన్ 3 న హీరో శ‌ర్వానంద్, ర‌క్షితా రెడ్డిల వివాహం జైపూర్ లీలా ప్యాలెస్‌లో ఘ‌నంగా జ‌రిగింది. వీరి వివాహానికి టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. గత కొన్నిరోజులుగా శర్వానంద్ తండ్రి కాబోతున్నాడని, రక్షిత ప్రస్తుతం గర్భవతి అని చెప్పుకొస్తున్నారు. రక్షిత అమెరికాలో టెక్కీగా వర్క్ చేస్తోంది. పెళ్లి తరువాత ఆమె తన వర్క్ కోసం అక్కడికి వెళ్ళింది. సినిమాలు షూటింగ్ ఉండడం వలన శర్వా ఇక్కడే ఉండిపోయాడని చెప్పుకొచ్చారు.

ఇక ఈ విషయమై ఇప్పటివరకు నోరువిప్పని శర్వా.. నేడు తన పుట్టినరోజున తాను తండ్రి అయ్యినట్లు అధికారికంగా చెప్పుకొచ్చాడు. రక్షిత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిందని చెప్పుకొచ్చాడు. ఇక కూతురు పేరు లీలా దేవి మైనేని అంటూ రివీల్ చేశాడు. దీంతో పాటు శర్వా, రక్షిత.. లీలతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేశాడు. వైట్ డ్రెస్ లో శర్వా దంపతులు.. చిన్నారి ఎంతో అద్భుతంగా ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. పుట్టినరోజున.. తన కూతురు పుట్టిందని చెప్పడం చాలా బావుందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇంకొంతమంది.. ఈ కాలంలో కూడా అచ్చతెలుగు పేరు పెట్టడం బావుందని కామెంట్స్ పెడుతున్నారు.

Show comments