Sharwanand: హే.. శర్వా.. నువ్వా.. పెళ్ళికి ముందే ఇలా మారిపోయావు ఏంటీ ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sharwanand: టాలీవుడ్ యంగ్ హీరోల్లో శర్వానంద్ ఒకడు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ విజయాపజయాలను పక్కనపెట్టి ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక గతేడాది ఒకే ఒక జీవితం సినిమాతో ముందుకొచ్చిన శర్వా.. ఈ ఏడాది ఒక ఇంటివాడు కాబోతున్నాడు. తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె రక్షితా రెడ్డితో శర్వా వివాహం.. జూన్ 2, 3 తేదీల్లో రాజస్థాన్ లోని జైపూర్ లో గల లీలా ప్యాలెస్ లో జరగనున్న విషయం తెల్సిందే. ఇక పెళ్లి పనుల్లో ఉండగానే శర్వా కారుకు చిన్న యాక్సిడెంట్ అయ్యింది. అయితే అందులో ఈ హీరో లేకపోవడంతో అభిమానులు అందరు ఊపిరి పీల్చుకున్నారు. ఇక పెళ్ళికి కొన్ని రోజులు మాత్రమే సమయం ఉండడంతో పెళ్లి పిలుపులు మొదలెట్టేశాడు శర్వా. తన పెళ్ళికి సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానించడానికి స్వయంగా తానే వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి బయల్దేరాడు. తాజాగా శర్వానంద్.. ఎంపీ సంతోష్ కుమార్ ను ప్రగతి భవన్ లో కలిశాడు. తన పెళ్లి శుభలేఖను ఇచ్చి.. పెళ్ళికి ఆహ్వానించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
Srikanth Addala: ‘నారప్ప’ డైరెక్టర్.. ‘అఖండ’ విశ్వరూపం.. PK తోనా..?
Also Read
- SlumDog – 33 Temple Road: 'స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్' కు డబ్బింగ్ చెప్పిన విజయ్ సేతుపతి... టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
- Anasuya: బాధ్యత ఉండక్కర్లా.. బుచ్చిబాబు'కి అనసూయ పరోక్ష కౌంటర్?
- Peddi Collections : బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' కలెక్షన్ల సునామీ.. ఏకంగా ఎన్ని కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందో తెలిస్తే మైండ్ బ్లాక్!
- Athiradi OTT Release Date: 65 కోట్ల మలయాళ హిట్ మూవీ ఓటీటీలోకి... తెలుగులోనూ స్ట్రీమింగ్
ఇకపోతే ఈ ఫోటోలో శర్వా లుక్ చాలా ఆశ్చర్యకరంగా ఉంది. లైట్ గడ్డంతో.. ఫార్ముల్ లుక్ లో ఎంతో స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ముఖ్యంగా చాలా బక్కచిక్కి కనిపిస్తున్నాడు. దీంతో అయ్యా.. శర్వా.. నువ్వేనా .. ఏదో కొత్తగా కనిపిస్తున్నావు.. పెళ్ళికి ముందే అలా తగ్గిపోతే ఎలా..? అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే జాను సమయంలో జరిగిన యాక్సిడెంట్ తరువాత శర్వా అమాంతం బరువు పెరిగాడు. దాని తరువాత కొద్దికొద్దిగా ఆ బరువును తగ్గించుకుంటూ మునుపటి రూపానికి వచ్చాడు. అయితే ఇది మరీ ఘోరంగా ఉందని, అసలు శర్వాను గుర్తుపట్టలేకుండా ఉన్నామని అభిమానులు చెప్పుకొస్తున్నారు.
తాజావార్తలు
-
Physical Harassment : నర్సింగ్ విద్యార్థినిపై వేధింపుల కలకలం.. ట్యూటర్‌పై కేసు, ఉద్యోగానికి గుడ్‌బై.!
-
Annamalai: బీజేపీకి రాజీనామా.. 24 గంటల్లోనే అన్నామలైకి అపూర్వ మద్దతు..
-
Trump-Iran: ‘వాస్తవ ప్రపంచంలో జీవించండి’.. ట్రంప్‌కు ఇరాన్ ఘాటు రిప్లై
-
The Earth: భూగర్భ జలాల దోపిడి.. 31.5 అంగుళాలు వంగిన భూమి!
-
CJI Surya Kant: లండన్‌లో సీజేఐ సూర్యకాంత్‌కు అవమానం.. ‘కాక్రోచ్’ వ్యాఖ్యలపై నిరసనలు
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!