NTV Telugu Site icon

Sharwanand: హే.. శర్వా.. నువ్వా.. పెళ్ళికి ముందే ఇలా మారిపోయావు ఏంటీ ..?

Sharwa

Sharwa

Sharwanand: టాలీవుడ్ యంగ్ హీరోల్లో శర్వానంద్ ఒకడు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ విజయాపజయాలను పక్కనపెట్టి ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక గతేడాది ఒకే ఒక జీవితం సినిమాతో ముందుకొచ్చిన శర్వా.. ఈ ఏడాది ఒక ఇంటివాడు కాబోతున్నాడు. తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె రక్షితా రెడ్డితో శర్వా వివాహం.. జూన్‌ 2, 3 తేదీల్లో రాజస్థాన్ ‌లోని జైపూర్‌ లో గల లీలా ప్యాలెస్‌ లో జరగనున్న విషయం తెల్సిందే. ఇక పెళ్లి పనుల్లో ఉండగానే శర్వా కారుకు చిన్న యాక్సిడెంట్ అయ్యింది. అయితే అందులో ఈ హీరో లేకపోవడంతో అభిమానులు అందరు ఊపిరి పీల్చుకున్నారు. ఇక పెళ్ళికి కొన్ని రోజులు మాత్రమే సమయం ఉండడంతో పెళ్లి పిలుపులు మొదలెట్టేశాడు శర్వా. తన పెళ్ళికి సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానించడానికి స్వయంగా తానే వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి బయల్దేరాడు. తాజాగా శర్వానంద్.. ఎంపీ సంతోష్ కుమార్ ను ప్రగతి భవన్ లో కలిశాడు. తన పెళ్లి శుభలేఖను ఇచ్చి.. పెళ్ళికి ఆహ్వానించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Srikanth Addala: ‘నారప్ప’ డైరెక్టర్.. ‘అఖండ’ విశ్వరూపం.. PK తోనా..?

ఇకపోతే ఈ ఫోటోలో శర్వా లుక్ చాలా ఆశ్చర్యకరంగా ఉంది. లైట్ గడ్డంతో.. ఫార్ముల్ లుక్ లో ఎంతో స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ముఖ్యంగా చాలా బక్కచిక్కి కనిపిస్తున్నాడు. దీంతో అయ్యా.. శర్వా.. నువ్వేనా .. ఏదో కొత్తగా కనిపిస్తున్నావు.. పెళ్ళికి ముందే అలా తగ్గిపోతే ఎలా..? అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే జాను సమయంలో జరిగిన యాక్సిడెంట్ తరువాత శర్వా అమాంతం బరువు పెరిగాడు. దాని తరువాత కొద్దికొద్దిగా ఆ బరువును తగ్గించుకుంటూ మునుపటి రూపానికి వచ్చాడు. అయితే ఇది మరీ ఘోరంగా ఉందని, అసలు శర్వాను గుర్తుపట్టలేకుండా ఉన్నామని అభిమానులు చెప్పుకొస్తున్నారు.

Show comments